Republic Day 2025 Parade: రిపబ్లిక్ డే సమీపిస్తోంది.ఇండియా తన శక్తి సామర్ధ్యాల్ని ప్రదర్శించేందుకు సిద్ధమౌతోది. మొట్టమొదటిసారిగా పరేడ్‌లో ప్రళయ్ మిస్సైల్ కన్పించనుంది. ఇది శత్రువులకు ఓ సవాలు విసరనుంది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ ఇండియా క్తి సామర్ధ్యాలకు ఓ మచ్చుతునక.
ప్రళయ్ మిస్సైల్ ప్రళయ్ మిస్సైల్‌ను పరేడ్‌లో ప్రదర్శించడం ద్వారా ఇండియా శక్తి సామర్ధ్యాల్ని శత్రు దేశాలకు చూపించినట్టవుతుంది. రక్షణ రంగంలో ఇండియా ఎంత ఆత్మ నిర్భరంగా ఉందో కూడా చాటి చెబుతుంది.
సరిహద్దు రక్షణలో ప్రళయ్ మిస్సైల్ ప్రత్యేకంగా ఇండియా సరిహద్దుల్లో అంటే ఎల్ఐసీ, ఎల్ఓసీ మొహరించేందుకు రూపకల్పన జరిగింది. శత్రువుల వ్యూహాల్ని ధ్వంసం చేయగలదు
ఇతర మిస్సైల్స్‌తో పోలిక ప్రళయ్ మిస్సైల్‌ను చైనాకు చెందిన డోంగ్ ఫెంగ్ 12, రష్యాకు చెందిన ఇస్కాండర్ మిస్సైల్‌కు సమానమని తెలుస్తోంది. ఈ మిస్సైల్ యుద్ధ మైదానంలో శత్రువులకు దీటైన సమాధానం చెబుతుంది
ప్రళయ్ మిస్సైల్ సాంకేతిక ప్రత్యేకతలు ఈ మిస్సైల్ 350-500 కిలోమీటర్ల దూరం వరకూ ఛేదించగలదు. 500-1000 కిలోల వరకూ పేలోడ్ తీసుకెళ్లగలదు. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడంలో అద్బుతంగా పనిచేస్తుంది
డీఆర్డీఓ ఆవిష్కరణ ప్రళయ్ మిస్సైల్‌ను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఈ మిస్సైల్ ఇండియా రక్షణ అవసరాల్ని పరిగణలో ఉంచుకుని తయారు చేశారు. ప్రత్యేకించి చైనా, పాకిస్తాన్ దేశాలకు సవాలు విసరనుంది
ప్రళయ్ మిస్సైల్ రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారి ప్రళయ్ మిస్సైల్ ప్రదర్శించనుంది. ఇది ఇండియా స్వదేశీ పరిజ్ఞానం, ఆర్మీ శక్తికి ఉదాహరణ. ఈ మిస్సైల్ శత్రు స్థావరాల్ని గురి పెట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది