Luxurious Trains List: ఇండియాలోని టాప్ 5 లగ్జరియస్ ట్రైన్లు, అందులోని సౌకర్యాలు ఇవే

సాధారణంగా రైళ్లనేవి సాధారణ, మధ్య తరగతి పౌరుడి ప్రయాణ సాధనంగా ఉంటాయి. కానీ ఇండియాలో కొన్ని రైళ్ల టికెట్ ధరలు లక్షల్లో ఉంటాయంటే నమ్మగలరా..కానీ నిజమే. నమ్మక తప్పదు. దేశంలోని టాప్ 5 సూపర్ లగ్జరియస్ ట్రైన్ల గురించి తెలుసుకుందాం. ఈ రైళ్లలో హైఫై సౌకర్యాలు, టికెట్ ధర, రూట్‌మ్యాప్ అన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. రాజులు మహారాజుల్లా రాచరికంతో రైలు ప్రయాణం చేయాలనుకుంటే..ఈ రైళ్లలో ప్రయాణిస్తే చాలు ఆ అనుభూతి తప్పకుండా వస్తుంది.

Luxurious Trains List: సాధారణంగా రైళ్లనేవి సాధారణ, మధ్య తరగతి పౌరుడి ప్రయాణ సాధనంగా ఉంటాయి. కానీ ఇండియాలో కొన్ని రైళ్ల టికెట్ ధరలు లక్షల్లో ఉంటాయంటే నమ్మగలరా..కానీ నిజమే. నమ్మక తప్పదు. దేశంలోని టాప్ 5 సూపర్ లగ్జరియస్ ట్రైన్ల గురించి తెలుసుకుందాం. ఈ రైళ్లలో హైఫై సౌకర్యాలు, టికెట్ ధర, రూట్‌మ్యాప్ అన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. రాజులు మహారాజుల్లా రాచరికంతో రైలు ప్రయాణం చేయాలనుకుంటే..ఈ రైళ్లలో ప్రయాణిస్తే చాలు ఆ అనుభూతి తప్పకుండా వస్తుంది.

1 /5

ది గోల్డెన్ ఛారియట్ అంటే బంగారపు రధం అని అర్ధం. పేరుకు తగ్గట్టే ఇందులో వసతులు, సౌకర్యాలుంటాయి.ఇది కేవలం ఇండియాలోనే కాదు..మొత్తం ప్రపంచంలోనే అద్భుతమైన టైన్లలో ఒకటిగా ఉంది. ది గోల్డెన్ ఛారియట్ ట్రైన్‌ను ఇండియన్ రైల్వేస్, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా నడుపుతున్నాయి.ఈ ట్రైన్ దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, గోవాలను సందర్శింపజేస్తుంది. ఈ ట్రైన్ కనిష్ట ధర 3 లక్షల 36 వేల 137 రూపాయలు కాగా..అత్యధికంగా 5 లక్షల 88వేలుగా ఉంది. 

2 /5

డెక్కన్ ఓడీసీ ప్రపంచపు అతి లగ్జరీ రైళ్లలో ఒకటిగా ఉంది. ఇండియన్ రైల్వే స్ నడుపుతున్న ఈ ట్రైన్ మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లను సందర్శింజేస్తుంది. ఈ ట్రైన్ నీలం రంగులో ఉంటుంది. ఇందులో 5 స్టార్ హోటల్, రెండు రెస్టారెంట్లు, కంప్యూటర్, ఇంటర్నెట్ బార్, బిజినెస్ సెంటర్ వంటి 21 లగ్జరీ కోచ్ లున్నాయి. ఈ రైలు కనిష్ట ధర 5 లక్షల 12 వేల రూపాయల్నించి ప్రారంభమై..అత్యధికంగా 11 లక్షల 9 వేల వరకూ ఉంటుంది.

3 /5

రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ఇండియన్ రైల్వేస్ నడుపుతున్న మరో లగ్జరీ ట్రైన్. రాజస్థాన్ పర్యాటక శాఖ, ఇండియన్ రైల్వేస్ సంయక్తంగా ఈ రైలు నడుపుతున్నాయి. 5 స్టార్ హోటల్ సేవలు, సౌకర్యాలతో కూడిన ఈ రైలు కూడా రాచరికపు అనుభూతిని కల్పిస్తుంది. ఈ రాచరికపు రైలు దేశ రాజదాని ఢిల్లీ నుంచి ప్రారంభమై..రాజస్థాన్‌లోని పర్యాటక ప్రాంతాలైన జోధ్‌పూర్, ఛితౌస్‌గఢ్, ఉదయ్‌పూర్, రణథంబోర్, జైపూర్ వంటి ప్రాంతాలతో పాటు మధ్యప్రదేశ్‌లోని ఖజురహో, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాతో పాటు వారణాసికు కూడా తీసుకెళ్తుంది. ఇందులో స్టోర్స్, సెలూన్, లాంజ్‌బార్, ఎల్‌సీడీ టీవీ, ఏసీ, బెడ్ రూమ్స్, జిమ్, స్పా, బార్‌లు ఉన్నాయి. ఈ ట్రైన్ టికెట్ ధర 3 లక్షల 63 వేల నుంచి 7 లక్షల 56 వేల వరకూ ఉంటుంది.

4 /5

ప్యాలెస్ ఆన్ వీల్స్ ప్రపంచంలోని అతిగొప్ప లగ్జరీ రైళ్లలో ఒకటిగా ఉంది. ఈ రైళ్లో నడుస్తున్న రాజమహల్ అనుభూతి కచ్చితంగా కలుగుతుంది. ప్యాలెస్ ఆన్ వీల్స్‌లో ఆధునిక జీవితపు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో 2 డైనింగ్ రూమ్స్, రెస్టారెంట్స్, బార్, సెలూన్ షాప్ ఉంటాయి. ఇండియన్ రైల్వేస్ నడుపుతున్న లగ్జరీ రైళ్ల జాబితాలో ఈ రైలుంది. ప్యాలెస్ ఆన్ వీల్స్ ..రాజధాని ఢిల్లీ నుంచి ఆగ్రా, భరత్‌పూర్, జోధ్‌పూర్, జైసల్మేర్, ఉదయపూర్, సవాయీ మాధవపూర్, జైపూర్ ప్రాంతాల్ని సందర్శింపజేస్తుంది. ఈ ట్రైన్ టికెట్ 5 లక్షల 23 వేల నుంచి ప్రారంభమై..9 లక్షల 42 వేల రూపాయలు వరకూ ఉంటుంది. 

5 /5

మహారాజా స్పెషల్ ఇండియాలో నెంబర్‌వన్ లగ్జరీ మరియు ఖరీదైన ట్రైన్. ఈ ట్రైన్ పేరుకు తగ్గట్టే ప్రయాణం ఉంటుంది. ఈ రైళ్లో ప్రయాణించాలనే కోరిక ప్రతి భారతీయుడికి ఉంటుంది. ఈ రైళ్లో అతిపెద్ద డైనింగ్ రూమ్, బార్, లాంజ్, ఎల్‌సీడీ టీవీ వంటి సౌకర్యాలున్నాయి. దాంతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. లగ్జరీ బాత్రూమ్స్ ఉన్నాయి. మహారాజా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత ఏంటంటే..ఇందులో డయల్ ఫోన్ సౌకర్యముంది. ఈ ట్రైన్ ప్రయాణీకుల్ని రాజధాని ఢిల్లీ నుంచి ఆగ్రా, వారణాసి, జయపూర్, రణతంబోర్, ముంబై ప్రాంతాల్ని సందర్శింపజేస్తుంది. ఈ రైలు కనిష్ట ధర 5 లక్షల 41 వేలు. ట్రైన్‌లోని ప్రెసిడెన్షియల్ సూట్ ధర 37 లక్షల 93 వేల 482 రూపాయలు మాత్రమే. ఇదే ఈ రైళ్లో అత్యధిక ధర.