IPL 2023 Updates: రూట్ మార్చిన క్రికెటర్లు.. సరికొత్త పాత్రలో ఎంట్రీ..!

Indian Premier League: రేపటి నుంచి క్రికెట్ అభిమానులకు టీవీలకు అతుక్కుపోనున్నారు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాలు మోత మోగనున్నాయి. ప్రపంచంలోనే క్రేజీ లీగ్ ఐపీఎల్ శుక్రవారం నుంచి ఆరంభం కానుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్  జట్ల మార్చి 31న మొదటి మ్యాచ్‌తో ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఐదుగురు యాక్టివ్ ప్లేయర్లు కామెంటేటర్‌గా కనిపించనున్నారు. వారిపై ఓ లుక్కేయండి..
 

  • Mar 30, 2023, 13:13 PM IST
1 /5

ఫాస్ట్ బౌలర్ ధావల్ కులకర్ణి ఐపీఎల్ 2023లో జియో సినిమా కామెంట్రీ బృందంతో కలిసి పని చేస్తాడు. మరాఠీ కామెంట్రీ ప్యానెల్‌లో జాయిన్ అవుతాడు. ఇంతకుముందు స్టార్ స్పోర్ట్స్‌తో కామెంట్రీ చేశాడు. ధావల్ ఇప్పటివరకు 92 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది ముంబై ఇండియన్స్ జట్టు తరుఫున ఆడాడు.   

2 /5

ఆసీస్‌ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్ ఈసారి కామెంటేటర్ అవతారం ఎత్తనున్నాడు. గతేడాది రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ ఏడాది కామెంట్రీ బాక్స్‌లో కనిపించనున్నాడు. స్టార్ స్పోర్ట్స్‌తో జాయిన్ కానున్నాడు.   

3 /5

టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్ కామెంటేటర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోవడంతో కామెంట్రీ బాక్స్‌లో సరికొత్త పాత్ర పోషించనున్నాడు. జియో సినిమా యాప్ కోసం మరాఠీ కామెంట్రీ చేయనున్నాడు.  

4 /5

టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి ఈ సీజన్‌లో కామెంటేటర్‌గా కనిపించనున్నాడు. జియో సినిమా యాప్ కోసం తెలుగు వ్యాఖ్యానం చేస్తాడు.    

5 /5

ఆర్‌సీబీ, చెన్నై జట్ల తరుఫున ఆడిన కేబీ అరుణ్ కార్తీక్ కామెంట్రీ బాక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం పాండిచెర్రీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరుణ్ కార్తీక్.. జియో సినిమా కోసం తమిళ కామెంటేంటర్‌గా వ్యవహరించనున్నాడు.