ఐపీఎల్ 2023 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2023 సీజన్ 16 ఐదుగురు క్రికెటర్లకు చివరి సీజన్ కావచ్చని తెలుస్తోంది. అంటే ఈ సీజన్ తరువాత ఈ క్రికెటర్లు ఐపీఎల్ ఆడకపోవచ్చు. ఐపీఎల్‌లోని పది జట్లు యంగ్ ట్యాలెంట్ కోసం అణ్వేషిస్తున్నాయి. మరోవైపు కేరాన్ పోలార్డ్ డ్వెయిన్ బ్రేవేలు ఐపీఎల్ నుంచి వైదొలగినా..ఇతర టీ20 లీగ్స్ ఆడుతున్నారు. అదే విధంగా త్వరలో ఈ ఐదుగురు కూడా ఐపీఎల్‌కు వీడ్కోలు పలకనున్నారు.
IPL 2023: ఐపీఎల్ 2023 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2023 సీజన్ 16 ఐదుగురు క్రికెటర్లకు చివరి సీజన్ కావచ్చని తెలుస్తోంది. అంటే ఈ సీజన్ తరువాత ఈ క్రికెటర్లు ఐపీఎల్ ఆడకపోవచ్చు. ఐపీఎల్‌లోని పది జట్లు యంగ్ ట్యాలెంట్ కోసం అణ్వేషిస్తున్నాయి. మరోవైపు కేరాన్ పోలార్డ్ డ్వెయిన్ బ్రేవేలు ఐపీఎల్ నుంచి వైదొలగినా..ఇతర టీ20 లీగ్స్ ఆడుతున్నారు. అదే విధంగా త్వరలో ఈ ఐదుగురు కూడా ఐపీఎల్‌కు వీడ్కోలు పలకనున్నారు.
ఎంఎస్ ధోని ఎంఎస్ ధోనికు ఐపీఎల్ 2023 చివరిది కావచ్చు. 40 ఏళ్లు దాటినా, టీమ్ ఇండియా నుంచి రిటైర్ అయినా ఐపీఎల్ మాత్రం కొనసాగించాడు. హోమ్ గ్రౌండ్లో చివరి గేమ్ ఆడాలని భావించినట్టున్నాడు. ఈ ఐపీఎల్ ధోనికు చివరిది కావడంతో ఫ్యాన్స్‌కు ఇబ్బందిగానే ఉంటోంది.
దినేష్ కార్తీక్ 38 ఏళ్ల దినేష్ కార్తీక్‌కు సైతం ఇదే చివరి ఐపీఎల్ కావచ్చు. టీ20 ప్రపంచకప్‌లో ఇండియా సెమీఫైనల్స్ నుంచి వైదొలగడంతోనే దినేష్ కార్తీక్ టీమ్ ఇండియా స్థానం కూడా పోయింది. ఐపీఎల్ తరువాత దినేష్ కార్తీక్ కోసం టీవీ బ్రాడ్ కాస్త్ కెరీర్ నిరీక్షిస్తోంది.
డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2023లో అత్యంత ముఖ్యమైన ఆటగాడు డేవిడ్ వార్నర్. ఈ మధ్యన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న అద్భుత ఆటగాడు. ఈ ఐపీఎల్ తరువాత డేవిడ్ వార్నర్ ఇక ఆడకపోవచ్చు.
అమీ మిశ్రా వయ్సు 40 ఏళ్లు. అత్యధిక వయస్సు కలిగిన రెండవ క్రికెటర్. అతని వయస్సు దృష్ట్యా గత ఏడాది జరిగిన వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. ఈ ఐపీఎల్ 2023లో 41వ ఏట అడుగుపెడుతున్నాడు ఈ స్పిన్నర్. ఇతనికి ఇదే చివరి ఐపీఎల్ కావచ్చు.
అంబటి రాయుడు అంబటి రాయుడు వయస్సు ఇప్పుడు 38 ఏళ్లు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 274 పరగులు చేశాడు. ఈ సీజన్ రాయుడికి చివరిది కావచ్చు.