Nagachaitanya sobhita wedding: నాగాచైతన్య శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఒక వైపు ఇండస్ట్రీలో, మరోవైపు సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల పెళ్లి ఎట్టకేలకు డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుందని తెలుస్తొంది. ఆగస్టు 8 వ తేదీన చైతు, శోభితల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. వీరి ఎంగెమ్ పిక్స్ ను నాగార్జున తన ఇన్ స్టాలో పొస్ట్ చేసి మరీ విషేస్ చెప్పిన విషయం తెలిసిందే.
మరీ ఏ మూహుర్తానికి వీరి ఎంగెజ్ మెంట్ అయ్యిందో అప్పటి నుంచి ఏదో ఒక రూమర్స్ వార్తలలో ఉంటునే ఉన్నాయి. కొంత మంది నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేతల అనంతరం ఆమెను ఐరన్ లెగ్ గా ట్రోల్ చేశారు. ఇక వేణుస్వామి చేసిన రచ్చ పీక్స్ అని చెప్పుకొవచ్చు
ఆయన వ్యాఖ్యలు హైకోర్టు వరకు వెళ్లడం, వుమెన్ కమిషన్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇవన్ని ఒక వైపు అయితే.. వీరి పెళ్లి తేదీపై రూమర్స్ వచ్చాయి. కొంత మంది నాగార్జున పెళ్లిని వద్దనుకుంటున్నారని, హోమాలు , పూజలు తర్వాత మళ్లీ డెట్ అనౌన్స్ మెంట్ చేస్తారన్నారు.
అదే విధంగా.. వేణు స్వామి 2027లో ఒక లేడీ కారణంగా చైతు, శోభితల మధ్య గొడవలు వస్తాయని, డైవర్సీ వరకు వెళ్తుందని బాంబు పేల్చారు. మరోవైపు కొందరైతే.. ఈ పెళ్లిపై లేని పోనీ రూమర్స్ రోజు వ్యాప్తి చేశారు.
చైతు కట్నం అంత తీసుకుంటున్నాడని, శోభితా లగ్జరీ విల్లా, బ్రాండెడ్ కార్లు, స్పోర్ట్స్ బైకులు సైతం తీసుకెళ్తుందని పుకార్లు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పుకార్లు చూసి అక్కినేని అభిమానులు మాత్రం తలలు పట్టుకుంటున్నారంట.
తాజాగా, అక్కినేని నాగచైతన్య, శోభితల అఫిషియల్ పెళ్లి పత్రిక ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. దీనిలో శోభితా ధూళి పాళ పేరు..లక్ష్మీ శొభితగా పెళ్లి పత్రికలో ఉంది.
దీంతో అక్కినేని అభిమానులు అయితే.. శొభితా అసలు పేరు.. లక్ష్మీ శోభితన ..అంటూ ఆశ్చర్యపోతున్నారంట.. అక్కినేని ఇంట లక్ష్మీలాంటి కోడలు అడుగిడుతుందని సంబరాలు కూడా చేసుకుంటున్నారంట.