Jaya Ekadashi vrat 2025: జయ ఏకాదశిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు ముఖ్యంగా కొన్ని నియమాలు పాటిస్తే ఈ శ్రీమహా విష్ణువు ఆశీర్వాదాలు లభిస్తాయని పండితులు చెబుతుంటారు.
మాఘామాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈ సారి మనం జయ ఏకాదశిని మనం ఫిబ్రవరి 8న జరుపుకోబోతున్నాం. మాఘమాసంలో దీన్ని ఎంతో పవిత్రమైన రోజుగా చెప్తుంటారు.
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అందులో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణ పక్షంలో ఒకటి ఏకాదశి తిథులు వస్తుంటాయి. ఏకాదశి తిథి శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతీకరమైనది. ఈరోజున ఆయనను పూజిస్తే జీవితంలోని సమస్యలన్ని దూరమౌతాయంట.
మనం ఫిబ్రవరి 8న జరుపుకోబోయే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. అంటే ఈరోజున ఏ పనులు ప్రారంభించిన అది నిర్వఘ్నంగా పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు. అదే విధంగా ఏకాదశి శుభమూహుర్తం సూర్యోదయం నుంచి రాత్రి వరకు ఉంది.
ఈ సమయంలో తలస్నానం చేసి, ఉతికిన బట్టలు వేసుకుని దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. శ్రీ మహా విష్ణువు అలంకార ప్రియుడు. కాబట్టి ఆయనను రకరకాల పూలతో అలంకరణ చేయాలి. ప్రత్యేకంగా పండ్లు, స్వీట్లతో నైవేద్యాలు పెట్టాలి.
అదే విథంగా ఈరోజున మనం చేసుకునే పూజలు, జపాలు, హోమాలు వంద రేట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా.. ఈ సారి జయ ఏకాదశి శనివారం వస్తుంది. ఈరోజున ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నవారు... శనికి తైలాభిషేకం, నల్లనువ్వులతో అభిషేకం, పండితులకు నవధాన్యాలు దానంగా ఇస్తే దోషాల నుంచి బైటపడొచ్చని పండితులు చెబుతున్నారు.
జయ ఏకాదశి రోజున తెల్ల జిల్లెడు వత్తులతో శ్రీమన్నారయణుడి దగ్గర దీపం వెలిగించాలి. మేడి చెట్టు అడుగు భాగంలో నెయ్యితో దీపారాధన చేయాలి. నల్ల చీమలకు బెల్లం లేదా చక్కెరను తినేందుకు వేయాలి. పేదవాళ్లకు స్వీట్లను పంచిపెట్టాలి. వస్త్రదానం చేస్తే కూడా మంచి శుభాలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు.