Jayam Ravi: జయంరవి-ఆర్తి 15 సంవత్సరాల వివాహ బంధం తర్వాత విడిపోవడానికి కారణం అదేనా..?

Jayam Ravi divorce : 15 సంవత్సరాల పాటు వైవాహిక బంధంలో సంతోషంగా మెలిగిన జయం రవి ఆర్తి గత ఏడాది విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు వీరి విడాకుల వ్యవహారం విచారణకు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 /5

కోలీవుడ్లో ప్రముఖ నటుడుగా పేరుపొందిన జయం రవి ఆయన భార్య ఆర్తి విడిపోతున్నట్లు గతే ఏడాది  అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. దీంతో 15 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరపడింది. అయితే ఈ వ్యవహారంలో జయం రవి భార్య ఆర్తి మాత్రం విడాకులు కోరలేదు. జయం రవి విడాకులు కోరుతూ.. చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సైతం విచారించిన న్యాయస్థానం ఇద్దరిని కూడా మళ్లీ కలిసి జీవించి, వారి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పించింది. 

2 /5

ఇప్పటివరకు అటు జయం రవి, భార్య ఆర్తి మధ్య మూడుసార్లు సామరస్య చర్చలు కూడా జరిపారు. అయితే గత శనివారం రోజున ఈ కేసు విచారణకు రావడంతో ఆర్తి, జయం రవి ఇద్దరు కూడా ఆన్లైన్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. వీరిద్దరి న్యాయవాదులు సైతం తమ క్లైంట్లు మధ్య సామరస్య చర్చల కోసం శనివారం రోజున మధ్యవర్థులను ఆహ్వానించినట్లు కోర్టుకి వివరణ ఇచ్చుకున్నారు.  దీంతో ఈ సామరస్య చర్చలు పూర్తి అయిన తర్వాత తీర్పు ప్రకటిస్తామంటూ న్యాయమూర్తి తేనెతోమొళి వెల్లడించారు. దీంతో ఈ కేసుని వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేశారు. 

3 /5

ఇటీవల జయం రవి కూడా తన పేరును రవి మోహన్ అని మార్చుకున్నారు. జయం రవి విడిపోవడానికి ముఖ్య కారణం ప్రముఖ గాయని కేనిషాతో ప్రేమలో ఉన్నారని,  అందుకే తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత రవి మోహన్ ఈ విషయాన్ని ఖండించినప్పటికీ కేనిషా తన స్నేహితుడని వివరణ ఇచ్చింది. 

4 /5

కానీ ఇప్పుడు వీరిద్దరూ విడిపోవడానికి అసలు కారణం.. ఆర్తి తల్లి జోక్యం వల్లే జయం రవి ఆర్తి విడిపోవడానికి కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా వీరిద్దరూ గొడవ పడినప్పుడు ఆర్తి తల్లి జోక్యం చేసుకుందని,  కానీ ఇప్పుడు కూడా ఆమె జోక్యం వల్లే విసిగిపోయిన రవి విడాకులు కోరాడు అని సమాచారం.

5 /5

 ఏది ఏమైనా భార్యాభర్తల గొడవల్లోకి ఇంకొక వ్యక్తి కలగజేసుకోవడం ఏమాత్రం పద్ధతి కాదు అని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మళ్ళీ వీరిద్దరూ  సామరస్యంతో ఒక్కటవ్వాలని కూడా కోరుకుంటున్నారు