Jio-Airtel-BSNL 365 Days Plans: ఏయిర్‌టెల్ జియో, బీఎస్‌ఎన్‌ఎల్ ఈ టెలికాం కంపెనీలు రకరకాల రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే, ఈ కంపెనీలకు చెందిన 365 రోజుల లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jio-Airtel-BSNL 365 Days Plans: టెలికాం కంపెనీలు కస్టమర్ల అవసరాల నిమిత్తం రకరకాల రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే ఈ నాలుగు టెలికాం కంపెనీలకు చెందిన 365 రోజుల ప్లాన్ వ్యాలిడిటీ ఈరోజు తెలుసుకుందాం. అంతేకాదు ఈ ప్లాన్స్‌లో ఏది చీప్ అండ్ బెస్ట్ కూడా మీకు తెలుసా?
ఎయిర్‌టెల్ 365 రోజుల ప్లాన్.. ఎయిర్‌టెల్ 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.3999 ఇందులో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు. డైలీ 2.5 జీబీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ప్లాన్‌లో 5జీ సేవలు కూడా పొందుతారు. అంతేకాదు ఈ ప్లాన్ ఏడాదిపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా యాక్సెస్ పొందుతారు. ఎయిర్‌టెల్ ఎక్ట్సీమ్ యాప్, అపోలో 24/7 సర్కిల్, ఫ్రీ హలోట్యూన్స్ కూడా ఉచితం.
జియో 365 రోజుల ప్లాన్.. ఈ ప్లాన్ ధర కూడా రూ.3,999. దీని వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం 2.5 జీబీ డేటా. ఏ నెట్‌వర్క్ అయిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. అయితే, ఈ ప్లాన్‌లో అదనంగా ఫోన్‌కోడ్ సబ్‌స్క్రీప్షన్, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ కూడా పొందుతారు.
బీఎస్‌ఎన్‌ఎల్ 365 రోజుల ప్లాన్.. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఏడాది ప్లాన్ ధర కేవలం రూ.2,999 మాత్రమే. ఈ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 3 జీబీ డేటా పొందుతారు. 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఏ నెట్ వర్క్ అయిన అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.
వీఐ రూ.4219 ప్లాన్.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా ఏడాది పాటు ఉంటుంది. వంద ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. డైలీ 2 జీబీ డేటాతోపాటు 100 ఎస్‌ఎంఎల్‌లు కూడా ఉచిం. ఈ ఏడాది ప్లాన్‌తో సోనీలైవ్ సబ్‌స్క్రీప్షన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్. బింజే ఆల్ నైట్, కూడా పొందుతారు.