Bank Job Recruitment: నిరుద్యోగులకు బంఫర్‌ ఛాన్స్‌.. ఏకంగా మేనేజర్ అవ్వొచ్చు.. తక్కువ కాంపిటీషన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌!

Andhra Pradesh State Co Operative Bank Ltd Job Recruitment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (APCOB) ఇటీవలే జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతంలో ఏర్పడిన ఖాళీలను ఇప్పుడు భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెళ్లడించింది.

1 /6

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (APCOB)లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని DCCB బ్యాంకులలో ఉండే స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్ నోటిఫికేషన్‌లను విడుదల చేసిన్నట్లు తెలిపింది. దీంతో పాటు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు.    

2 /6

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ భర్తీలను శ్రీకాకుళం, కృష్ణ, గుంటూరు, కర్నూలులో ఖాళీలను ఫిల్‌ చెయ్యబోతున్నట్లు తెలిపింది.  అప్లికేషన్ ప్రక్రియ జనవరి 8వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ తేదిల్లోపు ఎప్పుడైనా ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.   

3 /6

ఈ జాబ్స్‌కి అప్లై చేసుకునేవారు ఫిబ్రవరి నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీటీబీటీ) ద్వారా పరీక్ష రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాల ఎంపిక అనేది ఇంటర్వ్యూతో పాటు ఇతర టేస్టులపై ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో- ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ దరఖాస్తు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.    

4 /6

పోస్టుల పేర్ల వివరాల్లోకి వెళితే.. DCCB బ్యాంకు సంబంధించిన పోస్టులు చూస్తే, ప్రస్తుతం స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్‌తో పాటు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ముఖ్యంగా ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు తప్పకుండా డిగ్రీ విద్యార్హతను కలిగి ఉండాల్సి ఉంటుంది.    

5 /6

అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడడం  స్కిల్‌ ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఇక ఇందులోని అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లో ప్రత్యేకమైన అర్హతలను కలిగి ఉండాల్సి ఉంటుంది.    

6 /6

అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు తప్పకుండా అభ్యర్థులు 700 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టుకు సంబంధించిన సాలరీ రూ.28,177 నుంచి ప్రారంభమవుతుంది. సీనియారిటీని బట్టి జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.