Devara Bollywood: బాలీవుడ్ లో మరో రేర్ ఫీట్ అందుకున్న ఎన్టీఆర్ ‘దేవర’..

Devara Bollywood: రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తర్వాత ఏ హీరో అయినా సక్సెస్ కొట్టాలంటే మాములు విషయం కాదు. కానీ  ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘దేవర’తో ఆ సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు. అంతేకాదు తాజాగా ‘దేవర’ మూవీతో బాలీవుడ్ లో ఎన్టీఆర్  మరో ఫీట్ అందుకున్నాడు.

1 /6

Devara Bollywood: రాజమౌళితో సినిమా చేసి ఏ కథానాయకుడికైనా .. ఆ తర్వాత సినిమాతో పెద్ద ఫ్లాప్ అందుకునాడేది సెంటిమెంట్ గా వస్తుంది.  తాజాగా దేవరతో ఎన్టీఆర్.. ఆ సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు. సినిమాలో దమ్ముంటే బాక్సాఫీస్ దగ్గర ఏ సెంటిమెంట్ పనిచేయదనేది  ప్రూవ్ చేసాడు తారక్.

2 /6

అంతేకాదు గతంలో మూడు సార్లు రాజమౌళి సెంటిమెంట్ కు బలైన ఎన్టీఆర్.. ఈ సారి దాన్ని ఎదురొడ్డి నిలబడ్డాడు. అంతేకాదు గతంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా  ద్విపాత్రాభినయం చేసిన  ఆంధ్రావాలా, శక్తి సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి.  తాజాగా ‘దేవర’ లో కూడా తండ్రీ తనయులుగా నటించాడు. ఓ రకంగా ‘దేవర’తో తన రెండు బ్యాడ్ సెంటిమెంట్స్ ను బ్రేక్ చేసాడు.

3 /6

ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ‘దేవర’ ఎన్టీఆర్ కు తొలి సోలో ప్యాన్ ఇండియా చిత్రం. అక్కడ ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. అంతేకాదు రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. ఓవరాల్ గా రూ. 75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. అంతేకాదు బీ టౌన్ కూడా తొలి సోలో హిట్ ను అందుకొని ఆ టెస్ట్ లో పాస్  అయ్యాడు.

4 /6

ముఖ్యంగా ‘దేవర’ కోసం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం కలిసొచ్చే అంశం అని చెప్పాలి.   మొత్తంగా సోలో హీరోగా ఎన్టీఆర్ కు  ప్యాన్ ఇండియాలో హిందీలో ‘దేవర’తో మంచి హిట్ అందుకున్నాడు.

5 /6

ఇక తమిళనాడులో మాత్రమే ఈ సినిమా కాస్త పుంజుకోవాలి. మొత్తంగా విడుదలైన అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ఏది ఏమైనా హిందీ బెల్ట్ లో మాత్రం సోలో  కథానాయకుడిగా తారక్  తన స్టామినా ఏంటో ‘దేవర’ మూవీతో  ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పాలి.

6 /6

త్వరలో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’తో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్. మరోవైపు ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ‘డ్రాగన్’ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో పూర్తి స్థాయి మార్కెట్ ను సొంతం చేసుకోవడం పక్కా చెబుతున్నారు ట్రేడ్ పండితులు.