Jr NTR: బాలయ్య సాక్షిగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ కు ఘోర అవమానం జరిగింది. అవును తాజాగా నందమూరి బాలకృష్ణకు కేంద్రం దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో గౌరవించింది. ఈ సందర్భంగా బాలయ్యను అభినందిస్తూ కుటుంబ సభ్యులు పత్రికా ప్రకటన ఇచ్చారు.
Jr NTR - Balakrishna: నందమూరి కుటుంబంలో దాదాపు 56 యేళ్ల తర్వాత పద్మ అవార్డు వరించింది. అప్పట్లో 1968లో అన్న ఎన్టీఆర్ తో పాటు అక్కినేని నాగేశ్వరరావు కు ఒకేసారి పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఇన్నేళ్లకు పద్మ అవార్డు రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
తాజాగా కేంద్రం 2025 గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయా రంగాల్లో తమదైన ప్రతిభను సేవలను చేసిన వారిని గుర్తించి పద్మ అవార్డులతో గౌరవించింది. తెలుగు నుంచి ఈ యేడాది బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
బాలయ్యకు ఎపుడో రావాల్సిన ఈ అవార్డు ఆలస్యంగా వచ్చినా.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు పత్రికా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అటు అన్న నందమూరి కుటుంబ సభ్యులందరు కలిసి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉన్న మాస్ మీరో. అన్ని వేళలా ప్రజలకు అండగా నిలిచే నిబద్దత గల నాయకుడు. క్యాన్సర్ పేషేంట్లను పేదలను ఆదుకునే ఆప్తుడు. ఒక కొడుకుగా.. ఒక భర్తగా.. ఒక తండ్రిగా.. ఒక సోదరుడిగా.. ఒక తాతగా తన బాధ్యతలను ఏనాడూ మరువని వ్యక్తి అంటూ కీర్తిస్తూ ప్రకటన ఇచ్చారు.
అంతేకాదు మీకు భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారం వచ్చినందుకు మేమందరం ఎంతో గర్విస్తున్నామన్నారు. మీ చుట్టూ ఉడే అందరి జీవితాలకు వెలుగులు పంచుతూ .. మీరు ఎల్లప్పుడూ ఇలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలంటూ జై బాలయ్య.. నందమూరి మరియు నారా కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేసారు.
ఇందులో ప్రతి ఒక్క నందమూరి సోదరులు, సోదరీమణుల కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించారు. అందులో కీర్తి శేషులు హరికృష్ణ, శ్రీమతి లక్మి పేర్లనున్నాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారి పేరైన శాలిని పేరును కూడా ప్రచురించలేదు. ఓ రకంగా రెండో భార్యగా ఆమెను గుర్తించడం లేదనే వాదనలకు బలం చేకూరింది.
ఇప్పటికే ఎన్టీఆర్ రెండో భార్యగా లక్ష్మీపార్వతిని కుటుంబ సభ్యులు గుర్తించనట్టే.. నందమూరి ఫ్యామిలీకి ప్యాన్ ఇండియా లెవల్లో పేరు తీసుకొచ్చొనా.. జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారి పేరు నందమూరి కుటుంబ సభ్యుల పేర్లలో చేర్చలేదు. మధ్యలో ఎన్టీఆర్ కు బాబాయి బాలయ్యకి మంచి సంబంధాలే ఉన్నా.. రాజకీయాల కారణంగా అవి బీటలు మారాయి.
అప్పట్లో ఎన్టీఆర్ వర్సిటీతో పాటు మేనత్త పై వైసీపీ నాయకులు దుర్భాష లాడినా ఎన్టీఆర్ పెద్దగా స్పందించింది లేదు. దీంతో ఆ దూరం మరింత పెరిగింది. న్యూట్రల్ ఉందామనుకున్న తారక్ స్ట్రాటజీ అక్కడ ఫెయిల్ అయింది. ఇక బాలయ్య కూడా తాను హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ లో కావాలనే ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా నొక్కి పెడుతున్నారనేది అందరికీ తెలుస్తూనే ఉంది.
ఒక బాబాయికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించినపుడు తొలిసారి స్పందించింది అబ్బాయి ఎన్టీఆర్ అని చెప్పాలి. బాబాయి ప్రేమ కోసం ఆర్తిగా ఎదురు చూస్తోన్న అటు వైపు నుంచి స్పందన కరువైందనే ముచ్చట వినబడుతోంది. మరి బాలయ్య.. తన అబ్బాయి మీద ఇకనైనా కరుణా చూపించి తన ఫ్యామిలీలో కలిపేసుకుండాడా లేదా అనేది చూడాలి.