Karthika Deepam 2: నా ప్రాణదాత మీ అమ్మే అని చెప్పేసిన కార్తీక్‌.. త్వరలోనే గట్టిదెబ్బ తీస్తా అని ప్లాన్‌ వేసిన జో..

Karthika Deepam 2 January 10 Episode: సైకిల్‌పై కార్తీక్‌ దీపలు కంపెనీ నుంచి ఇంటికి వెళ్తుంటారు. దారిలో వారిని జో అడ్డగిస్తుంది. నా మీద గెలిచారని సంబరపడిపోతున్నారా? బావా అంటుంది. మా నాన్న ఉన్నాడు కానీ, అక్కడే గూవపగిలిపోయే సమాధానం ఇచ్చేదాన్ని అని దీప ను అంటుంది జో. మా బావను రెచ్చగొట్టి కంపెనీకి తీసుకువచ్చింది అంటుంది.
 

1 /10

నీ జీవితం ఆగిపోయింది అది నీకు ఇంకా అర్థం కావడంలేదు బావ అంటుంది జో. దీప పక్కన ఉండగా నువ్వు గెలవలేవు అంటుంది. మారడానికి అందరికీ టైమ్‌ కావాలి బావ అంటుంది జో. అందరినీ పట్టించుకోకపోతే తగిలిన దెబ్బ పోదు. భగవంతుడు పేరుప్రతిష్ఠలు ఇచ్చాడు. సాటి మనిషిలా చూడు అంటుంది దీప. అధికారం ఉంది కదా అని తలపొగరుతో నడుచుకోకు గట్టిగా ఎప్పుడో ఒకసారి తింటావు అంటుంది.  

2 /10

ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండు ఇంటి పరువు తీయకు అందరినీ తీసుకువచ్చి నడిరోడ్డుపై నిలబెట్టకు అంటాడు కార్తీక్‌. పదా దీప ఇలాంటి వాళ్లతో మాట్లాడకపోవడమే మేలు అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. జో మాత్రం ఏం తగ్గదు. ఇక ఏం చేస్తానో చూడండి, చాలా గట్టిగ బాధపడతావు, అడుగడునా నన్ను రెచ్చగోడుతున్నారు అనుకుంటుంది.  

3 /10

కాంచనకు మజ్జిగ తీసుకు వచ్చి ఇస్తుంది అనసూయ. అప్పుడే కార్తీక్‌ దీపలు వస్తారు. మీరు ఎప్పుడు వచ్చారు అండి అని అనసూయను పలకరిస్తాడు. అత్తయ్య నువ్వు ఎప్పుడు వచ్చావు? అంటుంది. చెప్పకుండా వెళ్లిపోయావు ఇల్లు ఖాళీగా ఉంది కదా.. ఎవరికైనా అద్దెకు ఇవ్వాలని వెళ్లా అంటుంది అనసూయ ఇప్పుడు నేను వచ్చాను కదా.. ఇప్పుడు ఈ గొడవ వదిలేయ్‌ అంటుంది.  

4 /10

ఆ మనిషి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మావయ్య వచ్చాడు జ్యోత్స్నతో అందరికీ సారీ చెప్పి మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. నా మేడలో ఈ దండ వేశారు ఉద్యోగులు. నిజానికి ఈ దండ నా మెడలో కాదు దీప మెడలో ఉండాలి అని దీప మెడలో వేస్తాడు కార్తీక్‌. మీ పక్కన నిలబడటం తప్ప నేను చేసింది ఏమీ లేదు అంటుంది దీప. ఈ విజయంలో నీకూ సగభాగం ఉంది అంటాడు కార్తీక్‌. నాన్న సగం దండ అమ్మది, సగం నాన్నది ఎలా ఉంది అని శౌర్య ఇద్దరికీ కలిపి దండ వేస్తుంది.  

5 /10

మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఆగండి అందులో నేను ఉన్నాను..అని శౌర్య కూడా వారి మధ్యలో వెళ్లి నిలబడుతుంది. అప్పుడు అనసూయ అమ్మ.. గడుగ్గాయ్‌ అంటుంది. ఎలా ఉంది అంటుంది శౌర్య. అయితే, ఒక ఫోటో తీయ్‌ అంటుంది.  ముగ్గురూ ఒకే దండలో ఎంత చూడముచ్చటగా ఉన్నారో ఒకసారి ఇలా చూడండి అని ఫోటో తీస్తుంది కాంచన.చూడు ఫోటో ఎంత బాగా వచ్చింది అంటుంది శౌర్య.  

6 /10

దీప వేరే గదిలోకి వెళ్తుంది. ఆ దండ తీసి పక్కన పెడుతుంది. అనసూయ వస్తుంది కార్తీక్‌ బాబుకు నీపై ఉంది అంటుంది. అది సానుభూతి మాత్రమే అంటుంది దీప. ఆయనకు రక్తం ఇచ్చి కాపాడానన్న ఆరాధన మాత్రమే ఉంది అంటుంది దీప. మన అవసరాన్ని గుర్తించి ఇచ్చేవాడిని దేవుడు అంటాడు. ఆ దేవుడిపై మనకు ఉండేది ఆరాధన. ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపానికి ప్రమిద చోటు ఇచ్చింది. ఆ దీపానికి ప్రమిదకు ఉన్న బంధం ఏంటి? నాకు కార్తీక్‌ బాబుకు ఉన్న బంధం అదే అంటుంది దీప.   

7 /10

ఈ దీపం ఆరిపోయేవరకు ప్రమిదను ఆరాధిస్తూనే ఉంటుంది అని దీప చెబుతుంది. తాలి కట్టిన వాడిని మొగుడిలా చూడమంటే, దేవున్ని చేసి పూజిస్తున్నావ్‌ కదే.. ఇంకా నేనేం చెప్పాలి అంటుంది అనసూయ. రాత్రి అవుతుంది. మళ్లీ శౌర్య కార్తీక్‌ లాకెట్‌ తీసుకుని మెడలో వేసుకుంటుంది. నాన్న నువ్వు అడిగితే ఇవ్వలేవు కదా అందుకే అడక్కుండా తీసేసుకున్నా అనుకుంటుంది శౌర్య. అప్పడే రౌడీ అని వస్తాడు కార్తీక్‌. దాచి పెట్టకుంటుంది శౌర్య. హోం వర్క్‌ చేశావా? ముందు ఆ చేతులు తీయ్యి అని చూస్తాడు లాకెట్‌ని. వెంటనే పరిగెత్తుతుంది శౌర్య.  

8 /10

దీప ఏమైంది? అంటుంది ఇది నీ మెడలో ఎందుకు వేసుకున్నావ్‌? అంటుంది. ఆడపిల్లది నాన్నకు ఎందుకు? అంటుంది శౌర్య ఇవ్వను ఇది నామెడలోనే ఉంటుంది నా ఫ్రెండ్స్‌ అందరికీ చూపిస్తా అంటుంది. ఇవ్వు రౌడీ అని వెంటపడతాడు దీంతో దీప వెనక్కి ముందుకు దాక్కుంటుంది. కార్తీక్ దీపను పట్టుకుంటూ రౌడీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. దీపకు కార్తీక్‌ పట్టుకుంటే ఏదోలా ఉంటుంది బ్యాగ్రౌండ్‌లో సాంగ్‌ వస్తుంది.  

9 /10

శౌర్య నానమ్మ నీకోసం తెచ్చిన బొమ్మను వేరే ఎవరికో ఇస్తే నువ్వు బాధపడతావు కదా.. అలానే ఇది కార్తీక బాబుది ఆయన బాధపడతాడు. తీసి ఇవ్వు అంటుంది దీప. ఇది నాన్న దగ్గరికి ఎలావచ్చింది? ఎవరు ఇచ్చారు? అంటుంది శౌర్య. చిన్న పిల్లవు నువ్వు అడగకూడదు అంటుంది దీప. నీకు తెలుసుకదా నువ్వు చెప్పు అంటుంది రౌడీ. అప్పుడు దీప కార్తీక్‌ బాబు ప్రాణదాతది నీకు ఫ్రెండ్‌ ఉంది కదా.. అలాగే కార్తీక్‌ బాబుకు ఫ్రెండ్‌ ఉంది. ఈ లాకెట్‌ ఆ మనిషిదే అని శౌర్య నుంచి తీసుకుని కార్తీక్‌కు ఇచ్చేస్తుంది.  

10 /10

నాన్న అమ్మేనా ఆ ప్రాణదాత అంటుంది శౌర్య. అవును అమ్మే ప్రాణదాత అంటాడు కార్తీక్‌. ప్లీజ్‌ నాన్న మీ ప్రాణదాత వచ్చేవరకు నేనే వేసుకుంటాను అంటుంది. దీన్ని పక్కన పెడితే నువ్వు తీసెసుకుంటావు అందుకే నేనే ఇది వేసుకుంటా అని మెడలో కార్తీక్‌ లాకెట్‌ వేసుకుంటాడు. చూశావా? అమ్మ నాన్నకు నాకంటే ఆ లాకెట్ ఎక్కవ అంటుంది శౌర్య.