Kavya Maran News: రాబోయే సంవత్సరానికి IPL కు సంబంధించిన మెగా వేలం ముహూర్తం ఫిక్స్ అయింది. దీనికి సంబంధించిన ఆక్షన్ సౌదీ అరేబియాలోని ప్రముఖ నగరమైన జెడ్డాలో జరగబోతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో ఆక్షన్ ఉండబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను తీసుకోవాలనే క్లారిటీ కి కూడా వచ్చాయి. ఆప్షన్ నుంచి గేమ్ ప్రారంభం అయ్యే వరకు క్రికెట్ ప్రేక్షకులకు పండగే..
గత సంవత్సరంలో ఎంతో పోటీపడి ముందుకు వచ్చి ఫైనల్ కు చేరుకున్న హైదరాబాద్ సన్రైజర్స్ టీం ఈసారి కప్పు కొట్టే యోవచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అద్భుతమైన వ్యూహంతో వేలంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ సన్రైజర్స్ ఫ్రాంచైజీ పలువురు ఆటగాళ్లను అనుకుందట.
ఈ మెగా ఆప్షన్‌లో భాగంగా కావ్య మారన్ ఐదుగురు ప్లేయర్లను ఏకంగా రూ. 75 కోట్లకు పైగానే రిటైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారిని రూ. 46 కోట్లతో కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కావ్య అద్భుతమైన ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని చూస్తోంది.
ఈ మెగా ఆప్షన్‌లో భాగంగా టాప్ సిక్స్ ప్లేయర్స్‌ను సన్ రైజర్స్ సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆరుగురు ప్లేయర్లలోని మొదటి ప్లేయర్ విషయానికొస్తే.. గత ఐపీఎల్లో 19 వికెట్లు తీసిన 33 ఏళ్ల టీ. నటరాజన్ మళ్లీ తిరిగి తీసుకోబోతున్నట్లు సమాచారం..
అలాగే అద్భుతమైన పట్టు కలిగిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ను కూడా తన స్థానాన్ని జట్టులో బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఇక మూడో ప్లేయర్ హైదరాబాద్ ఈ ప్లేయర్ అయిన మహమ్మద్ సిరాజును కూడా జట్టులోకి తీసుకోబోతోంది.
ఇక ఈ ఆరు ప్లేయర్లలో నాలుగవ ప్లేయర్ స్పిన్నర్ ఆటగాడు రవిచంద్రన్ కూడా హైదరాబాద్ సన్రైజర్స్ దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఐదవ ప్లేయర్గా అబ్దుల్ నమద్ కాబోతున్నాడు. ఇతను తక్కువ వేలంలో ధరకే రావడమే కాకుండా..అద్భుతమైన ఆట నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు.
ఇందులోని చివరి ప్లేయర్ విషయానికొస్తే సమీర్ రిజ్వీ.. ఈ ప్లేయర్‌ను అందరూ పవర్ హీటర్ గా కూడా పిలుస్తారు. చివరి నిమిషాల్లో అద్భుతమైన ఆట ప్రదర్శనను కనబరుస్తాడు. అంతేకాకుండా ఇప్పటికీ అనేక మ్యాచ్ లు కూడా ఆడారు.