Ketika Sharma: కేతిక శర్మ గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆమె కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు. అందుకే గ్లామర్ షోను నమ్ముకుంది. తాజాగా గ్లామర్ కాకుండా నార్మల్‌గా కనిపించి ఆశ్యర్యపరిచింది.
కేతిక శర్మ.. కొంత మంది హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు మొదటి సినిమాతోనే దక్కించుకుంటారు. అలాంటి వాళ్లలో కేతిక శర్మ ఒకరు.
కేతిక శర్మ ముందు యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆపై గాయనిగా.. అటు తన డబ్ స్మాష్‌లతో వీడియోలతో బాగా పాపులర్ అయింది. అలా ఒక్కో చాన్సుతో సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది.
పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది కేతిక. మొదటి సినిమాలోనే అందాల ఆరబోతతో సెగలు పుట్టించి హీట్ పుట్టించింది.
రొమాంటిక్ మూవీలో ఈమె అందాల జాతరకు ప్రేక్షకులు సహా సినీ ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. దీంతో కేతికకు వరుస ఛాన్సులు వచ్చి పడుతున్నాయి. కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.
లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' మూవీతో పలకరించినా.. ఈ భామకు పెద్దగా కలిసొచ్చిందేమి లేదు. పెద్ద హీరో సినిమాలో నటించానన్న సంతృప్తి తప్పితే.. ఈ సినిమాలో కేతిక క్యారెక్టర్ కూరలో కరివేపాకు టైపు అయిపోయింది.
కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో తన లక్‌ను పరీక్షించుకుంది.