KGF Actress: సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ పెద్ద హీరోయిన్స్ కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎపుడో ఒకప్పుడు ఫేస్ చేసినవారే కావడం గమనార్హం. ఇక ఒకపుడు తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని కేజీఎఫ్ భామ పలు మార్లు ఓపెన్‌గానే చెప్పేసింది.
Raveena Tandon: ఇందు గలడు అందు లేడనే సందేహం వలదు అన్నట్టు .. సినీ ఇండస్ట్రీ సహా ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే భూతం ఆడవాళ్ల పాలిట శాపంలా మారింది. ఇక అప్పట్లో సుశాంత్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజంతో పాటు కాస్టింగ్ కౌచ్ కారణంగా టాలెంట్ ఉన్న నటులకు సరైన అవకాశాలు రావడం లేదని ప్రముఖ నటి రవీనా టాండన్ వ్యాఖ్యానించారు.
ఇక్కడ బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ ఛాన్సులు వస్తాయని రవీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తమ మాట వినని నటీనటులను తొక్కి పారేస్తారని చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా టాలెంటెడ్ నటులపై ముందుగా పొగరు అనే ముద్ర వేస్తారు. బిహేవియర్ బాగా లేదంటూ తమకు అనుకూలమైన పత్రికల్లో వార్తలు రాయించి వారి క్యారెక్టర్ ను దెబ్బ తీస్తూ ఉంటారనే విషయాన్ని ప్రస్తావించారు.
అలా తన కెరీర్ ను నాశనం చేయాలని చాలా మంది ఎన్నో రకాల కుట్రలు చేసిన విషయాన్ని రవీనా టాండన్ ప్రస్తావించారు. దీని వెనక పెద్ద రీజనే ఉంది. నేను వాళ్ల బెడ్రూమ్ వరకు వెళ్లలేదనే కక్ష్య. వాళ్ల లైంగిక కోరికలు తీర్చలేదనే కసితో తనపై లేనిపోని బురద చల్లారనే నగ్న సత్యాలను రవీనా చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
కేవలం పడక సుఖం కోసమే కథానాయికల కెరీర్లను నాశనం చేసే బ్యాచ్ ఒకటి బాలీవుడ్లో ఇప్పటికీ ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. రవీనా టాండన్ విషయానికొస్తే.. తెలుగులో బాలయ్యతో 'బంగారు బుల్లోడు' సినిమాలో నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఇక్కడి అభిమానుల మనసు దోచుకుంది. గతేడాది ఈమెకు కేంద్రం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది.
రవీనా టాండన్ .. ప్రముఖ నిర్మాత రవి టాండన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. సల్మాన్ హీరోగా నటించిన 'పత్తర్ కే ఫూల్' సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మొహ్రా', 'అందాజ్ అప్నా అప్నా' 'దిల్ వాలే', వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో ఓ తరాన్ని తన నటనతో మెప్పించడం విశేషం. ఇక కేజీఎఫ్ సినిమాలో ఈమె రమికా సేన్ అనే ప్రధాన మంత్రి పాత్రలో నటించి మెప్పించింది.