Srinidhi Shetty: చీరలో మెరిసిన కేజీఎఫ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫొటోలు

Srinidhi Shetty Photos: కేజీఎఫ్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఈ సిరీస్‌ బ్లాక్ హిస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కడతాయని అనుకున్నా.. రెమ్యూనరేషన్ విషయంలో కాస్త బెట్టు చేయడంతో ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు యాక్టివ్‌గా ఉంటోంది. 
 

  • Dec 19, 2022, 23:36 PM IST
1 /5

శ్రీనిధి శెట్టి అక్టోబర్ 21, 1992న కర్ణాటకలో జన్మించింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్ టైటిల్స్‌ను గెలుచుకుంది. 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్‌ విన్నర్‌గానూ నిలిచింది.

2 /5

2018లో కేజీఎఫ్ మూవీతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత కేజీఎఫ్ 2లోనూ హీరోయిన్‌గా నటించింది.   

3 /5

అయితే ఈ రెండు సినిమాలు బ్లాక్‌హిట్ కావడంతో ఈ కన్నడ బ్యూటీ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట. అందుకే ఆఫర్లు తగ్గాయని ఇండస్ట్రీలో టాక్.   

4 /5

విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.   

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తోంది శ్రీనిధి. తాజాగా గోల్డ్ కలర్ చీరలో మెరిసిపోతున్న ఫొటోలను పంచుకుంది. మీరూ ఓ లుక్కేయండి.