Yoga for Kidney Stones Problem: కిడ్నీలో రాళ్లు అంటే గంభీరమైన సమస్యే. కిడ్నీల్లో పేరుకుపోయే ఘన పదార్ధాలు రాళ్లలా తయారవుతాయి. మూత్ర విసర్జన సమయంలో బయటికొచ్చే క్రమంలో నొప్పి ఉంటుంది. వైద్య పద్ధతులతో పాటు కొన్ని యోగాసనాలు వేయడం ద్వారా కూడా కిడ్నీలో రాళ్ల సమస్యను పోగొట్టవచ్చంటున్నారు. ఆ ఆసనాల గురించి తెలుసుకుందాం.
అప్రమత్తత ఈ యోగాసనాలు చేసేటప్పుడు ఎవరైనా యోగా నిపుణుడి సహాయంతో వేయడం మంచిది. లేకపోతే ఎక్కడైనా ఏమైనా కండరాలు పట్టేసే ప్రమాదముంది.
ధనురాసనం ఈ ఆసనం వెన్నుముక, కడుపు కండరాల్ని స్ట్రెచ్ చేస్తుంది. దాంతో మూత్ర వ్యవస్థ మెరుగుపడి రాళ్లుంటే బయటకు తొలగిపోతాయి.
పవనముక్తాసనం ఈ ఆసనం కడుపును మసాజ్ చేస్తుంది. గ్యాస్ ఉంటే బయటకు తన్నుకొస్తుంది. రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది
విపరీత కరణి ఈ ఆసనం రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కిడ్నీలపై ఒత్తిడి తగ్గిస్తుంది. దాంతో రాళ్ల కారణంగా తలెత్తే సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది.
భుజంగాసనం ఈ ఆసన కడుపు కండరాలను పటిష్టం చేసేందుకు దోహదం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపర్చి విసర్జన క్రియ సులభతరం చేస్తుంది. దాంతో రాళ్లు ఉంటే బయటకు వచ్చేస్తాయి
ఉష్ట్రాసనం ఈ ఆసనం వెన్నుముకను, కడుపు కండరాల్ని స్ట్రెచ్ చేస్తుంది. దీంతో మూత్ర విసర్జన మెరుగుపడుుతంది. రాళ్లు వంటివి ఉంటే బయటికొచ్చేస్తాయి.