World War 1 Pics: మొదటి ప్రపంచయుద్ధం గురించి మీకు తెలియని ఆ విషయాలు

ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా మూడవ ప్రపంచయుద్ధానికి సంబంధించిన సంకేతాలు, వార్తలు హోరెత్తిస్తుంటాయి. కానీ ప్రపంచయుద్ధమంటే మాటలా..అంత సులభమేం కాదు. మొదటి ప్రపంచయుద్ధపు కొన్ని ఘటనలు, ఫోటోలు చూస్తే మీకే పరిస్థితి అర్ధమవుతుంది. ఎంత భయంకరమో అది

World War 1 Pics: ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా మూడవ ప్రపంచయుద్ధానికి సంబంధించిన సంకేతాలు, వార్తలు హోరెత్తిస్తుంటాయి. కానీ ప్రపంచయుద్ధమంటే మాటలా..అంత సులభమేం కాదు. మొదటి ప్రపంచయుద్ధపు కొన్ని ఘటనలు, ఫోటోలు చూస్తే మీకే పరిస్థితి అర్ధమవుతుంది. ఎంత భయంకరమో అది

1 /6

మొదటి ప్రపంచయుద్ధం కారణంగా నాలుగు అతిపెద్ద సామ్రాజ్యాలు అంతమైపోయాయి. రష్యా,  జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ, టర్కీ సామ్రాజ్యాలు చీలిపోయాయి.

2 /6

మొదటి ప్రపంచయుద్ధం 1918 నవంబర్ 11న పూర్తయింది. జర్మనీ అధికారికంగా లొంగిపోయింది. ఇదే మొదటి ప్రపంచయుద్ధపు చివరి రోజు

3 /6

మొదటి ప్రపంచయుద్ధం కారణంగా ప్రపంచం రెండుగా విడిపోయింది. సెంట్రల్ పవర్‌కు జర్మనీ నేతృత్వం వహించగా, ఇందులో ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ, బల్గేరియా సహా ఇతర దేశాలు పాల్గొన్నాయి. అటు మిత్ర రాష్ట్రాల తరపున ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, జపాన్ సహా ఇతర దేశాలు పాల్గొన్నాయి. ఈ యుద్ధంలో 30 రకాల వేర్వేరు విషపూరిత వాయువులు వదిలారు. 

4 /6

ఈ భయంకరమైన మొదటి ప్రపంచయుద్ధంలో 13 లక్షలమంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. 62 వేలమంది మరణించారు. 67 వేలమంది క్షతగాత్రులయ్యారు. ఈ యుద్ధం కోసం ఇండియా 1 లక్షా 70 వేల జంతువులు, 37 లక్షల టన్నుల ధాన్యం పంపింది. 

5 /6

మొదటి ప్రపంచయుద్ధంలో 37 దేశాలు పాల్గొనగా అమెరికా 30 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు పెట్టింది. 1918 నవంబర్ వరకూ ఈ యుద్ధంలో 85 లక్షల 28 వేల 831 మంది మృత్యువాత పడ్డారు. ఈ యుద్ధం ముగిసిన తరువాతే ప్రపంచమంతా స్పానిష్ ఫ్లూ విస్తరించింది.

6 /6

మొదటి ప్రపంచయుద్ధానికి ప్రధాన కారణం..బోస్నియా రాజధాని సరాయేవోలో ఆస్ట్రియా సామ్రాజ్యపు అధినేత ఆర్క్‌డ్యూక్ ఫ్రెంజ్ హత్యకు గురి కావడం. వివిధ యుద్ధాల్లో ఇదొక భయంకరమైన యుద్ధం