Lemon Benefits: నిమ్మతో ఈ పదార్ధాలు కలిపి రాస్తే అద్భుతమైన అందం మీ సొంతం

Lemon Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఓవరాల్ ఆరోగ్యంతో పాటు చర్మం నిగారింపు కూడా ఉంటుంది. చర్మం నిగారింపుకు నిమ్మకాయ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

1 /6

నిమ్మకాయ పెరుగు పసుపులో నిమ్మరసం కలిపి రాస్తే ఇన్‌ఫ్లమేషన్ సమస్య తగ్గుతుంది. ముఖం క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది. రెడ్‌నెస్ పోతుంది

2 /6

చర్మం నిగారింపు కోసం పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి మాస్క్ రాసుకోవాలి. పెరుగు చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. 

3 /6

నేచురల్ గ్లో తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి మాస్క్ కింద రాసుకోవాలి. దీనివల్ల ముఖం హైడ్రేట్ అవుతుంది. నిమ్మకాయతో ముఖం మెరుస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది. నిగనిగలాడుతుంది

4 /6

స్క్రబ్బింగ్ కోసం ముఖం శుభ్రంగా ఉంచేందుకు నిమ్మరసంలో కాస్త పంచదార కలిపి ముఖానికి స్క్రబ్బింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం డెడ్ సెల్స్ తొలగిపోతాయి. ముఖం నిగారింపుకు ఉపయోగపడుతుంది

5 /6

సహజసిద్దమైన బ్లీచింగ్ తాజా నిమ్మకాయల రసం పిండి నేరుగా ముఖంపై మచ్చలకు రాయాలి. పిగ్మంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. చర్మం నిగనిగలాడుతుంది

6 /6

విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి పవర్ హౌస్ అంటారు. చర్మం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ముఖం నిగారింపుకు నిమ్మకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది.