ToothBrush: మీ టూత్ బ్రష్ బాత్రూమ్ లో పెడుతున్నారా..?.. ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా..?

Life Style: కొందరు టూత్ బ్రష్ లను బాత్రూమ్ లో సింక్ పక్కన లేదా బేసిన్ మీద పెట్టేస్తుంటారు. కొన్నిసార్లు బాత్రూమ్ లో ఒక విండో ఏర్పాటు చేసి టూత్ బ్రష్ ను దానిలో పెడతారు. కానీ ఇది ఏంత ప్రమాదకరరమని డెంటల్ వైద్యులు చెబుతున్నారు. 

1 /6

ఉదయాన్నే దాదాపు అందరు బ్రష్ చేసుకుంటారు. కొందరు బ్రష్ లను బాత్రూమ్ లోనే పెట్టేస్తుంటారు. కనీసం బ్రష్ తీసుకుని దాన్ని కడగకుండానే అలానే పేస్టు పెట్టేసి, నోటిలో దంతాలు శుభ్రం చేస్తుంటారు. ఇలా చేయడం ఎంతో డెంజర్ అంట.  

2 /6

బ్రష్ కు బాత్రూమ్ లో బోలేడు క్రిములు వాటినిపైన వచ్చి చేరిపోతాయంట. ఇది నోటిలో పెట్టుకుంటే దంతాలు శుభ్రం కావడం మాట దేవుడేరుగు.. కానీ పొట్టలోని క్రిములు నేరుగా వెళ్లిపోతాయి.   

3 /6

దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. వాంతులు, మోషన్స్ ల సమస్య కల్గుతుంది. కొందరిలో తీవ్రమైన జీర్ణవ్యవస్థకు చెందిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. 

4 /6

కొందరిలో తరచుగా అలర్జీల వంటివి కల్గుతాయి. నోటిలో నాలుకకు ఎర్రగా మారి, పుండ్లు మాదిరిగా మారుతుంది. రక్త స్రావం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి పనులు చేయకూడదు.

5 /6

చిన్న పిల్లలను కొందరు బాత్రూమ్ లలో కూర్చోబెట్టి బ్రష్ చేయిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల వారి కడుపులో కూడా హనీకర క్రిములు నేరుగా పొట్టలోకి వెళ్లిపోతాయి. పిల్లలకు ఇమ్యునిటీ తక్కువగా ఉండటం వల్ల తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 

6 /6

మనం ఉపయోగించే బ్రష్ లను నాలుగు నెలలకు ఒకసారి మార్చేయాలి. ఎప్పుడు కూడా బాత్రూమ్ లోపల బ్రష్ లను అస్సలు పెట్టకూడదు. బ్రష్‌ చేసుకునే ముందు, బ్రష్ చేసుకున్నాక... గోరు వెచ్చని నీళ్లతో బ్రష్ ను శుభ్రం చేయాలి.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)