mAadhar Update: ఆధార్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. ఈ కొత్త బెనిఫిట్స్‌‌ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

mAadhar App Updated Feature: ఆధార్‌ కార్డు మనం చేసే ప్రతి లావాదేవీకి కచ్చితం. అంతేకాదు ఏ సిమ్‌ కార్డు కొనాలన్నా, పాస్‌పోర్టుకు అప్లై చేయాలన్నా కూడా ఆధార్‌ కార్డు తప్పనిసరి. ఆధార్‌ నిజానికి మన దేశంలో ప్రతి వ్యక్తికి ఎంతో కీలకం. అయితే, మీరు ఎక్కడికి వెళ్లినా ఆధార్‌ కార్డు మీతోపాటు తీసుకెళ్లాల్సిన పనిలేదు. దీనికి సింపుల్‌గా మీ మొబైల్‌లో mAadhar యాప్‌ ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ యాప్‌లో కొత్తగా 35 ఫీచర్లతో అప్డేట్‌ చేశారు. 
 

1 /7

12 డిజిట్‌ నంబర్లు కలిగిన ఈ గుర్తింపు కార్డు యాప్‌ను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ఇండియా (UIDAI) mAadhar యాప్‌ను కూడా ప్రారంభించింది. అయితే, పాత యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసి కొత్తగా మళ్లీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే అప్డేట్‌ చేసిన 35 కొత్త ఫీచర్లను కూడా పొందుతారని యూఐడీఏఐ ఎక్స్‌ వేదికగా తెలిపింది.  

2 /7

mAadhar యాప్‌లో కొత్త వెర్షన్‌లో అందిస్తున్న ఫీచర్లు ఇవే.. ఆధార్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ ఇకేవైసీ డౌన్‌లోడ్‌ చేయవచ్చు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌, లేదా వ్యూ చేయవచ్చు. ఆధార్‌ రీప్రింట్‌ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇందులో మీరు అడ్రస్‌ కూడా అప్డేట్‌ చేసుకోవచ్చు

3 /7

ఆధార్‌ వెరిఫికేషన్‌, ఇమెయిల్‌, మెయిల్‌ వెరిఫికేషన్‌ చేయవచ్చు. యూఐడీ, ఈఐడీ, అడ్రస్‌ వ్యాలిడేషన్‌ లెట్టర్‌ రిక్వెస్ట్‌ కూడా ఈ mAadhar యాప్‌ ద్వారా పెట్టుకోవచ్చు.

4 /7

mAadhar App డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం.. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగానే mAadhar యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.  ఆ తర్వాత మీకు కావాల్సిన భాషను ఎంచుకోవాలి. ఆధార్‌ రిజిస్టర్డ్ మొబైల్‌నంబర్‌ ఎంటర్ చేసి 'నెక్ట్స్'పై క్లిక్‌ చేయాలి. అప్పుడు ఓటీపీ వస్తుంది. చివరగా సబ్మిట్‌ చేయాలి

5 /7

రిజిస్టర్‌ మై ఆధార్‌పై క్లిక్‌ చేసి నాలుగు డిజిట్‌ ఎంటర్‌ చేసి పిన్‌ కన్ఫామ్‌ చేయాలి. మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది ఆ ప్రక్రియను పూర్తి చేయాలి.  

6 /7

ఒకవేళ మీరు ఆధార్‌పై అడ్రస్‌ మార్చుకోవాలంటే 'సర్వీసెస్‌'లోకి వెళ్లి ' అప్డేట్‌ అడ్రస్‌ ఆన్‌లైన్‌'పై క్లిక్‌ చేయండి. ఆ తర్వాత ఆధార్‌ నంబర్‌, సెక్యూరిటీ క్యాప్చా కూడా ఎంటర్‌ చేయాలి.  

7 /7

ఓటీపీ వస్తుంది దాన్నినమోదు చేయాలి. అడ్రస్‌ ప్రూఫ్‌తో అప్డేట్‌ చేసుకోవాలి.చివరగా వెరిఫై చేసుకుంటే సరిపోతుంది.