Meena Second Marriage With Star Hero Rumours Goes Viral:: భర్త మరణంతో కుమార్తెతో ఉంటున్న సీనియర్ హీరోయిన్ మీనా రెండో పెళ్లికి సిద్ధమయ్యారనే వార్త సంచలనంగా మారింది. తనకంటే ఏడేళ్లు వయసు తక్కువ ఉన్న స్టార్ హీరోను పెళ్లి చేసుకున్నారనే పుకార్లు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.
చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా మీనా ఒక వెలుగు వెలిగారు. కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె వందకు పైగా సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది.
కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి వివిధ భాషల్లో హీరోయిన్గా మీనా నటించారు.
బాల నటిగా కెరీర్ ప్రారంభించిన మీనా తర్వాత హీరోయిన్గా.. అనంతరం రీఎంట్రీలో పిల్లలకు తల్లి పాత్రల్లో నటిస్తున్నారు.
బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను 2009లో వివాహం చేసుకున్న మీనా నైనిక అనే కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె భర్త విద్యాసాగర్ 2022లో అకాల మృతి చెందారు.
భర్త మృతి నుంచి కోలుకున్న మీనా సినీ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడిన మీనా తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కుమార్తె కోసం రెండో వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి మీనా వచ్చినట్లు పుకార్లు వస్తున్నాయి. ఆమె సన్నిహితులు, కుటుంబీకులు కూడా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందరి అభిప్రాయం మేరకు మీనా రెండో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె చేసుకోబోయే వ్యక్తి స్టార్ హీరో అని ప్రచారం జరుగుతోంది.
ఆ స్టార్‌కు మీనాకు ఏడేళ్ల వయసు వ్యత్యాసం ఉందని టాక్ వినిపిస్తోంది. మీనాకు 48 ఏళ్ల వయసు కాగా.. ఆ స్టార్ హీరోకు 41 ఏళ్లు ఉన్నాయంట. ఈ వార్త సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఏడేళ్ల చిన్నవాడిని మీనా పెళ్లి చేసుకుంటారనే వార్త హల్చల్ చేస్తుండగా.. అది ఒట్టి పుకారేనని.. అలాంటిదేమీ లేదని మీనా సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. అయితే ఆ హీరో ఎవరనేది తెలియరాలేదు.