Manmohan Singh Death Schools And Colleges Holiday: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా నేడు అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సెలవు అమల్లో రానుంది.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో భారతదేశం శోకసంద్రమైంది. అతడి మృతికి భారత ప్రభుత్వం తీవ్ర సంతాపం ప్రకటించింది.
మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా నేడు శుక్రవారం అన్ని విద్యాలయాలు (పాఠశాలలు, కళాశాలలు.. ఇతర) మూత పడనున్నాయి. మన్మోహన్‌కు నివాళిగా దేశంలోని అన్ని విద్యాలయాలు మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఇక ప్రభుత్వ కార్యాలయాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ విధుల్లో పాల్గొనడం లేదు.
ముందే నిర్ణయించబడిన (షెడ్యూల్) ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాప దినాలు పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా అధికారిక కార్యక్రమాలు వాయిదా వేయాలని నిర్ణయించింది.
మన్మోహన్ మరణ వార్త విన్న కొద్దిసేపటికే తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు నేడు శుక్రవారం సెలవు దినం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు దినంతో పాటు వారం రోజులు సంతాప దినాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించకముందే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ముందే సెలవును ప్రకటించాయి.
కాగా మన్మోహన్ సింగ్ మరణంపై న్యూ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశం విషాదంలో ఉన్న సమయంలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడం అనేది పద్ధతి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.