Manjula Nirupam: అమ్మ బాబోయ్‌ కార్తీక్.. భార్యతో అక్కడ అలా ఎంజాయ్‌ చేస్తున్న నిరుపమ్‌ ఫోటోలు వైరల్

Manjula Nirupam Photos Viral: నిరుపమ్‌ ఈ బుల్లితెర శోభన్‌ బాబు గురించిన ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'కార్తీక దీపం' సీరియల్‌లో నటించి మంచి ఫ్యామిలీ ప్రేక్షకుల మంచి క్రేజ్‌ మంచి సంపాదించుకున్నారు. ప్రస్తుతం 'కార్తీక దీపం 2' లో నటిస్తున్నారు అయితే, తాజాగా తన భార్య మంజులతో వెకేషన్స్ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
 

1 /5

మంజులా నిరుపమ్‌ వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 'చంద్రముఖి' సీరియల్‌ షూటింగ్‌ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు. మంజుల కూడా సీరియల్‌ నట. యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది.   

2 /5

ఇక నిరుమప్‌ ఎవరో కాదు ప్రముఖ నటుడు, రచయిత అయిన ఓంకార్‌ కొడుకు. ఈయన కార్తీక దీపం సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ఒకవిధంగా చెప్పాలంటే బుల్లితెర శోభన్‌ బాబులా చూస్తారు.  

3 /5

కార్తీక దీపం సీరియల్‌లో నటి ప్రేమీ విశ్వనాథ్‌తో కలిసి నటించారు. ఇందులో శోభ శెట్టి మోనితగా నటించింది ఆ సీరియల్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోయి మంచి టీఆర్పీ రేటింగ్‌ కూడా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో 'కార్తీక దీపం 2.. ఇది నవ వసంతంలో కూడా వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు.  

4 /5

ఈ సీరియల్‌ కూడా టీఆర్పీ పరంగా బ్రహ్మముడిని సైతం కూడా కిందకు తోసేసి టాప్‌లో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ మాటీవీలో ప్రసారం అవుతుంది. అయితే, తాజాగా నటుడు నిరుపమ్‌ తన భార్యతో కలిసి మాల్దీవుల్లో చిల్‌ అవుతున్నారు.  

5 /5

వారి ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు మంజుల నిరుపమ్‌. వీరు గతంలో కూడా గోవా, వియాత్నాం వంటి టూరిస్టు ప్రదేశాకు వెళ్లిన ఫోటోలు, యూట్యూబ్‌ ఛానల్‌లో వీడియోలను కూడా పోస్ట్‌ చేశారు. తాజాగా మంజుల నిరుపమ్‌ మాల్దీవుల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‌