Maha kumbh mela 2025: పుష్య మాసంలో చివరి అమావాస్యను మౌనీ అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజు ఎంతో ప్రాముఖ్యతను కల్గిఉందని పండితులు చెబుతున్నారు.
పుష్యమాసం అనేది శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసంగా పండితులు చెబుతున్నారు. అదే విధంగా ఈ మాసంలో ముఖ్యంగా.. మౌనీ అమావాస్య రోజు శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు.
ఈ సారి పుష్య అమావాస్య జనవరి 29వ తేదీ బుధవారం రోజున వస్తుంది. మరోవైపు దేశంలో ప్రయాగ్ రాజ్ లో పవిత్రమైన కుంభమేళ ఉత్సవం కూడా జరుగుతుంది. ఈరోజున కొన్నినియామలు, పరిహారాలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా పుష్య అమావాస్య రోజున.. చనిపోయిన పూర్వీకుల కోసం శ్రాధ్దాకర్మాదికాలు చేస్తే వారికి పుణ్యలోకాలు కల్గుతాయంట. వారి ఆశీర్వాదాలు కల్గుతాయని పెద్దలు చెబుతారు. అంతే కాకుండా.. గంగాస్నానం చేస్తే .. అనేక పాపకర్మల నుంచి విముక్తి లభిస్తుంది.
ఈరోజున ప్రయాగ్ రాజ్ కుంభమేళలో చాలా మంది షాహీ స్నానంను ఆచరిస్తారు. ఈరోజు పూజలు, ఉపవాసం, దానా ధర్మాలు, ఏవి చేసిన కూడా అది కొన్ని వందల రెట్లు అధిక లాభాలు ఇస్తాయని పండితులు చెబుతున్నారు.
అందుకే మౌనీ అమావాస్య రోజున ఏలీనాటి శనిదోషాలతో బాధపడుతున్నవారు.. నల్ల చీమలకు బెల్లం లేదా చక్కెర తినేందుకు పెట్టాలి. అంతే కాకుండా.. రావి చెట్టు నీడలో నేతి దీపంపెట్టాలి. పెదలకు అన్నదానం చేయాలి.
ఈరోజున పవిత్రమైన నదుల్లో స్నానాలు చేసి.. మన మనస్సులో బలమైన కోరికను కోరుకుని ఇష్టమైన పదార్థాంను ఏడాది పాటు వదిలేస్తే.. ఈ కోరిక వెంటనే తీరుతుందని కూడా పండితులు చెబుతుంటారు. అందుకు పవిత్రమైన మౌనీ అమావాస్య రోజున పరిహారాలు పాటించాలని పెద్దలు పలు సూచనలు చేస్తుంటారు. ( ఇది సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా రాయడం జరిగింది.. జీ మీడియా దీన్ని ధృవీకరించలేదు..)