హైదరాబాద్ నగర వాసులకు మరో శుభవార్త. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు టీఆర్ఎస్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే దుర్గం చెరువును సుందరీకరణ చేశారు. తాజాగా నగరంలో మరో స్టీల్ వంతెనను నిర్మించేందుకు టీఆర్ఎస్ సర్కార్ ఆమోదం తెలిపింది.
మెహిదీపట్నంలో ఆ బస్ షెల్టర్స్‌ను రీడిజైన్ చేయనున్నారు. పాదాచారుల కోసం 500 మీటర్ల పొడవున స్టీల్‌తో స్కైవాక్ నిర్మించనున్నారు. మొత్తం 16 లిఫ్ట్‌లను ఏర్పాటు చేయనుండగా.. ఇందులో రైతు బజార్లో రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేసేందుకు డిజైన్ రూపొందించారు. త్వరలోనే దీనికి సంబంధించి పనుల కోసం టెండర్లను ఆహ్వానిస్తారు.
All Images Credit: Twitter