Monsoon Foot Itching : వర్షం నీటి కారణంగా పాదాలలో దురద అనిపిస్తోందా? ఈ ఇంటి చిట్కాలు మీకోసం...

Foot Itching In Monsoon Remedies: వర్షాకాలం వ్యాధులు ప్రభలే కాలం. ఆఫీసులు ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లక తప్పదు. ఈ సీజన్‌లో వర్షాలు విపరీతంగా కురుస్తాయి. అయితే, వర్షం నీటికి కొంతమందికి అలెర్జీ వస్తుంది. ముఖ్యంగా కాళ్లలో దురదలు కూడా వస్తాయి. దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
 

1 /5

వర్షం నీటిలో కాలు పెడితే దురదలు కొందరిలో చూస్తాం. ఎందుకంటే ఈ నీటిలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టిరియా ఉంటుంది. దీని వల్ల ఇలా ఆ నీటికి దురదలు వస్తాయి. మీరు కూడా ఇలా వర్షంలో తడిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుసుకుందాం.  

2 /5

వర్షం నీటి వల్ల కాళ్లలో దురద అనిపిస్తే వెంటనే కాళ్లు శుభ్రం కడిగి కొబ్బరి నూనె అప్లై చేయండి. ఇందులో యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు ఉంటాయి. ఇది కాళ్లలో దురదను సమర్థవంతంగా తగ్గించేస్తుంది. అయితే, కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి అప్లై చేయాలి. వెంటనే దురద సమస్య తగ్గిపోతుంది.  

3 /5

కాళ్లలో దురదలు అనిపిస్తే వెంటనే ఉపశమనం పొందడానికి బేకింగ్‌ సోడా కూడా ఎఫెక్టీవ్‌ రెమిడీ. బేకింగ్‌ సోడా కలిపిన నీటిలో కాళ్లను పెట్టి ఓ పది నిమిషాల తర్వాత బయటకు తీయాలి. ఇది క్రిమినాశకారిణిగా కూడా పనిచేస్తుంది. కాబట్టి కాళ్ల దురద నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు.  

4 /5

కాళ్లలో దురదకు వేప ఆకులు కూడా ప్రభావవంతమైన రెమిడీ. ఎందుకంటే వేపలో యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు ఉంటాయి. వేపాకులు వేసి మరిగించిన నీటిలో మీ కాళ్ల ఓ 15 నిమిషాలపాటు అలాగే ఉంచండి. దీనివల్ల కూడా ఎంతో త్వరగా కాళ్ల దురద సమస్య తగ్గిపోతుంది.  

5 /5

ఈ ఇంటి చిట్కాలు మాత్రమే కాదు మార్కెట్లో యాంటీ ఫంగల్‌ క్రీములు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా వర్షాకాలంలో వచ్చే కాళ్ల దురదకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)