Monthly Income: ప్రతినెలా వడ్డీ రూపంలో ఆదాయం కావాలా? అయితే ఈ టాప్ -3 స్కీమ్స్ గురించి ఓ సారి తెలుసుకోండి


Investment Plan For Monthly Income : నేటికాలంలో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ప్రతినెలా ఎంతో కొంత ఆదాయం చేతికి వస్తే ఎంతో భరోసా ఉంటుంది. అది కూడా వడ్డీ రూపంలో వస్తే భవిష్యత్తుపై ఎలాంటి బెంగ ఉండదు. ప్రతినెల వడ్డీరూపంలో ఆదాయం వచ్చే సురక్షితమైన పథకాల్లో ఒకసారి పొదుపు చేస్తే ప్రతినెలా వడ్డీ వస్తుంది. మీరు కూడా అలాంటి ప్లాన్ చేస్తుంటే..మీకోసం 3 ముఖ్యమైన పథకాలు ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

1 /4

Investment Plan For Monthly Income: నేటికాలంలో చాలా మందికి భవిష్యత్తుపై ఆందోళన ఎక్కువైంది. ఎందుకంటే పెరుగుతున్న ఖర్చులకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదు. ఎంతోకొంత పొదుపు చేసుకుంటే భవిష్యత్తుకు ఎలాంటి భయం ఉండదని ప్లాన్ చేస్తుంటారు. అందులో భాగంగా మదుపు చేసిన ప్రతినెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ప్రతినెలా ఆదాయం పొందే మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. అయితే ఇది మీ కోసం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు ముఖ్యమైన స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   

2 /4

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ : (Senior Citizen Savings Scheme) ఈ స్కీములో మీరు ఒకేసారి పెద్ద అమౌంట్ ను పెట్టుబడి పెడితే మీకు ప్రతినెలా వడ్డీరూపంలో ఆదాయం వస్తుంది. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. పక్కగా వడ్డీ మీ చేతికి అందుతుంది. ఈ స్కీం సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మిగతా స్కీములతో పోల్చినట్లయితే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 60ఏండ్లు నిండినవారు ఈ స్కీములో పెట్టుబడి పెట్టవచ్చు. 8.2శాతం వడ్డీ ఉంటుంది. కనిష్టంగా వెయ్యి నుంచి గరిష్టంగా 30లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి మూడునెలలకు వడ్డీ చెల్లిస్తారు. 5ఏండ్లు, ఆ తర్వాత 3ఏండ్లు పొడిగించుకోవచ్చు. పోస్టాఫీసు, బ్యాంకుల్లో ఈస్కీము అందుబాటులో ఉంది.   

3 /4

పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ స్కీమ్: (Post Office Monthly Income Scheme)  ఈ స్కీములో ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి భయం అవసరం లేదు. పక్కగా ఆదాయం వస్తుంది. ఎవరైనా ఈ స్కీములో చేరవచ్చు. 10ఏండ్లకు పైనబడినవారి పేరు మీద కూడా అకౌంట్ ఇస్తారు. 7.4శాతం వడ్డీ చెల్లిస్తారు. వెయ్యి నుంచి రూ. 9లక్షల వరకు జాయింగ్ గా అయితే 15లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. నెలనెలా వడ్డీ చెల్లిస్తారు. 5ఏండ్ల వ్యవధి ఉంటుంది.    

4 /4

 ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ : (Tax Saving Fixed Deposits) ఈ స్కీములో పెట్టుబడి పెడితే నెలనెలా ఆదాయం వస్తుంది. పన్ను మినహాయింపులు కావాలని కోరుకునేవారు ఈ రకమైన ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా ఉపయోగకరంగా ఉ:టాయి. ఎవరైనా ఈ స్కీములో చేరవచ్చు. ఈ స్కీమ్ ను బ్యాంకులు అందిస్తాయి. బ్యాంకులను వడ్డీ ఉంటుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 7.5శాతం, 60ఏండ్లలోపు వారికి 7శాతం వడ్డీని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ స్కీములో పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.