Profitable Small Business Idea: కొత్త ఫుడ్ బిజినెస్‌ ప్లాన్.. తక్కువ పెట్టుబడితో ప్రతిరోజు రూ. 20,000 సంపాదించగలిగే బెస్ట్‌ ఐడియా ఇదే..!

Pizza Business Idea From Home: నేటికాలంలో వ్యాపారాలు విస్తృతంగా విస్తరిస్తున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాల వల్ల వ్యాపారాన్ని ప్రారంభించడం,నిర్వహించడం చాలా సులభమైంది. ఇ-కామర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ వంటి పద్ధతులు వ్యాపారాలను ప్రపంచవ్యాప్తంగా చేరుకోవడానికి సహాయపడుతున్నాయి. దీంతో పాటు ప్రభుత్వాలు స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇవి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి అవసరమైన మద్దతును అందిస్తున్నాయి. దీని వల్ల యువతలో స్వయం ఉపాధిపై ఆసక్తి పెరుగుతోంది. వారు తమ ఆలోచనలను వ్యాపారంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు కూడా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారాన్ని మార్కెట్‌లో డిమాండ్‌ ఉండటంతో పాటు బోలెడు డబ్బు కూడా సంపాదించవచ్చు. ఈ బిజినెస్‌ ఎలా ప్రారంభించాలి అనేది మనం తెలుసుకుందాం. 
 

1 /12

 ప్రస్తుతం స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుంది. దీంతో పాటు వ్యాపారాన్ని నిర్వహించడం వల్ల అనేక రకాల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల సృజనాత్మకంగా ఆలోచించడానికి అవకాశం లభిస్తుంది.

2 /12

సొంతంగా వ్యాపారం ప్రారంభించే ముందు మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది? మీకు ఏ నైపుణ్యాలు ఉన్నాయి? ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే మీరు మంచి వ్యాపార ఆలోచనను ఎంచుకోవచ్చు. అలాగే ఎంచుకున్న వ్యాపారానికి మార్కెట్‌లో డిమాండ్ ఉందో లేదో తెలుసుకోవడానికి మార్కెట్‌ను అధ్యయనం చేయండి.

3 /12

ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారంపీజా బిజినెస్. పీజా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఆహారం. కాబట్టి దీంతో మనం ఇంట్లోనే పీజాను తయారు చేసి ఎలా అమ్మవచ్చు అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ బిజినెస్‌ ఎలా ప్రారంభించాలి? ఎంత పెట్టుబడి అవుతుంది? నెలకు ఎంత లాభం వస్తుంది అనేది తెలుసుకుందాం. 

4 /12

పీజా బిజినెస్‌ ప్రారంభించే ముందు పీజా తయారీకి కావాల్సిన పదార్థాలు, వంట పాత్రలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ కొనుగోలు చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది అనేది తెలుసుకోవాలి. పీజా తయారీకి కావలసినంత స్థలం ఇంట్లో ఉండాలి. అలాగే పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం.

5 /12

ఇంట్లోనే పీజా బిజినెస్ స్టార్ట్ చేయాడానికి మీకు రూ. 2 లక్ష నుంచి రూ. 5 లక్షలు అవుతుంది. మీ వద్ద అంత పెట్టుబడి లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్‌ తీసుకోవచ్చు. దీంతో కావాల్సిన ముడి పదార్థాలు కొనుగోలు చేయవచ్చు.   

6 /12

 ముఖ్యంగా  ఆహార పదార్థాల తయారీకి కావాల్సిన లైసెన్స్ తీసుకోవాలి. మీ పీజాల గురించి ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియా, ఫ్లైయర్స్ మొదలైన వాటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే కస్టమర్లకు పీజాలను డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి.

7 /12

అయితే పీజాకు ప్రజల్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కాబట్టి మీరు వెజిటేరియన్, నాన్-వెజిటేరియన్, స్పెషల్ పీజాలు వంటి విభిన్న రకాల పీజాలు తయారు చేయడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవచ్చు. లేకుంటే మల్టీ గ్రెయిన్‌ తో పీజాలను తయారు చేసి కూడా మంచి లాభాలు పొందవచ్చు.   

8 /12

పీజా బిజినెస్‌లో కొన్ని సవాళ్లు కూడా ఎదురుకోవాల్సి ఉంటుంది. మొదటిది మార్కెట్లో పీజా బిజినెస్‌లు ఎక్కువగా ఉన్నాయి. కాబ్టటి మీరు ఎల్లప్పుడు కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మీ పీజాలలో మార్పులు చేసుకోండి. అలాగే పదార్థాల ధరలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కొన్ని స్లారు  కస్టమర్లకు త్వరగా డెలివరీ చేయడం కష్టంగా ఉంటుంది.

9 /12

 మీరు ఎంతో క్రియేటివిటీగా ఆలోచించి ఈ బిజినెస్‌ను రన్‌ చేయాల్సి ఉంటుంది. పిండి, టొమాటో సాస్, చీజ్, వెజిటేబుల్స్, నాన్-వెజిటేబుల్ టాపింగ్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ మొదలైనవి ఎల్లప్పుడు స్టాక్‌ ఉండేలా చేసుకోండి. 

10 /12

ఇంటి నుంచి చేసే పీజా బిజినెస్‌తో మీరు నెలకు రూ. 50వేలు సంపాదించవచ్చు. రోజుకు రూ. 2 వేల నుంచి రూ. 20 వేలు సంపాదించవచ్చు. మీ బిజినెస్‌ మరింత లాభాలు పొందాలంటే  సాధారణ పీజాలు కాకుండా కొత్త రకాల టాపింగ్స్, క్రస్ట్‌లు, సాస్‌లతో ప్రత్యేకమైన పీజాలు తయారు చేయండి.

11 /12

 మీ వెబ్‌సైట్ లేదా ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆర్డర్ చేయడానికి అనుమతించండి. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి డిస్కౌంట్‌లు లేదా కంబో ఆఫర్‌లు ఇవ్వండి. అలాగే బర్త్‌డే పార్టీలు, ఆఫీస్ ఈవెంట్‌లు  ఇతర సందర్భాల కోసం కేటరింగ్ సర్వీస్ అందించండి.

12 /12

మీ పీజాలను ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌లో అందించండి. ఇది మీ బ్రాండ్‌ను మెరుగుపరుస్తుంది, కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చతే  మీరు కూడా  స్టార్ట్ చేయండి.