Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమా వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతారామం' సినిమాతో తెలుగులో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుసగా తెలుగులో దూసుకుపోతుంది.
సీతారామంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మృణాల్ ఠాకూర్.. అంతకు ముందు బాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో సీతారామం సినిమా తర్వాత 'హాయ్ నాన్న', 'ది ఫ్యామిలీ స్టార్' చిత్రాలతో పలకరించింది. హాయ్ నాన్న సక్సెస్ అందుకుంటే.. ఫ్యామిలీ స్టార్ సినిమా ఈ అమ్మడి ఆశలపై నీళ్లు చల్లింది.
మృణాల్ ఠాకూర్ విషయానికొస్తే.. చిన్నతెరపై సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్.. మరాఠి సినిమా 'విట్టి దండు' సినిమాతో తెరంగేట్రం చేసింది.
ఆ తర్వాత మరాఠీ, హిందీ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. లాస్ట్ ఇయర్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'సెల్ఫీ' మూవీతో పలకరించింది.
ఇక ఈమె నెట్‌ఫ్లిక్స్ కోసం చేసిన 'గుమ్రా' సినిమాలో తన నటనతో మెప్పించింది. ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది.
అటు నెట్‌ఫ్లిక్స్ కోసం చేసిన 'లస్ట్ స్టోరీస్ 2'లో మృణాల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్‌లో తన సత్తా చూపెడుతోంది.
అంతేకాదు త్వరలో తమిళం, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది. అందకు తగ్గట్టు హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు సమాచారం.
మృణాల్ బాలీవుడ్‌లో నటించిన ఫస్ట్ మూవీ 'లవ్ సోనియా'. అటు హృతిక్ రోషన్‌తో చేసిన 'సూపర్ 30'లో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
హిందీలో తుఫాన్, ధమాకా సినిమాలతో అలరించిన ఈ భామ.. ఆ తర్వాత షాహిద్ కపూర్ హీరోగా నటించిన 'జెర్సీ' మూవీలో కథానాయికగా నటించింది.