Vignesh Shivan: ధనుష్‌తో వివాదం.. నయన తారకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త విఘ్నేష్ శివన్..?.. కారణమిదే..!

Nayanthara vs Dhanush: నయతార వర్సెస్ ధనుష్ వివాదం ఇండస్ట్రీలో కాకరేపుతుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో తన భార్యకు విఘ్నేష్ శివన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ ట్విటర్ అకౌంట్ ను డిలీట్ చేయడం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.

1 /6

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నయనతారల మధ్యన వివాదం పీక్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. నయన తార.. విఘ్నేశ్ శివన్ లు తమ పెళ్లికి సంబంధించిన.. బియాండ్ ది ఫెయిరీటేల్ పెళ్లి డాక్యుమెంటరీ కోసం.. నానుమ్ రౌడీదాన్.. మూవీలోని కొన్ని సీన్స్ వాడుకుంటామని ధనుష్ ను కోరినట్లు తెలుస్తొంది.

2 /6

కానీ ధనుష్ దీనికి అంగీకరించలేదు. ఇది ఎన్నో ఏళ్ల పాటు పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో నయన్ దంపతులు తమ మొబైల్ ఫోన్ లలో తీసిన కొన్ని క్లిప్స్ లో మూడు సెకన్ల పాటు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ధనుష్. ఏకంగా.. కాపీ రైట్ చట్టం కింద రూ. 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని నోటీసులు పంపిన విషయం తెలిసిందే.  

3 /6

దీనికి కౌంటర్ గా.. నయన్ తార కూడా సోషల్ మీడియా వేదికగా ధనుష్ నుఏకీ పారేస్తు.. కౌంటర్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం నయన్ , ధనుష్ ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేదిగా మారిందని చెప్పుకొవచ్చు. ఇటీవల కర్మ సిద్దాంతం అంటూ.. నయన్ మరోసారి ధనుష్ పై ఫైర్ అయ్యారు.  

4 /6

ఇదిలా ఉండగా.. తాజాగా, నయన్ భర్త విఘ్నేష్ శివన్ తన ట్విటర్ అకౌంట్ ను డిలీట్ చేయడం ప్రస్తుతం రచ్చగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో. అజిత్ నటించిన.. ఎన్నై అరిందాల్ మూవీకోసం పాట రాసినట్లు.. ఆ సమయంలోనే తన సినిమా నానుమ్ రౌడీ దాన్  చూసి అజిత్ మెచ్చుకున్నారని చెప్పారంట.

5 /6

 అయితే.. నానుమ్ రౌడీ దాన్ రిలీజ్ కు ముందే..అజిత్ మూవీ రిలీజైంది..ఇది ఎలా సాధ్యమంటూ ట్రోల్ చేశారంట. విఘ్నేశ్ శివన్ కు ఏ మాత్రం.. విలువలు లేవని దర్శకుడిగా తొలి అవకాశం ధనుష్ ఇచ్చాడని కూడా..నెటిజన్లు కొందరు సెటైర్లు వేస్తు కామెంట్లు చేస్తున్నారంట.

6 /6

అదే విధంగా.. “ఇటీవల పాన్ ఇండియా డైరెక్టర్ల రౌండ్ టేబుల్ చర్చలో ...కొంత మంది కాతువాకుల రెండు కాదల్ అసలు పాన్ఇండియ ప్రాజెక్ట్ కాదని ఎగతాళి చేశారంట. అంతేకాదు రాబోయే చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పాన్ ఇండియా లెవెల్ కి సరిపోదని విఘ్నేష్ పై విమర్శలు కురిపించారంట. దీంతో ఆయన హర్ట్ అయి.. తన అకౌంట్ ను డిలీట్ చేసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరీ దీనిపై విఘ్నేష్ శివన్ స్పందిస్తేనే అసలైన క్లారిటీ రానుంది.