Neeraj chopra marriage: స్టార్ అథ్లెట్ బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా ఒక ఇంటి వాడయ్యాడు. వీరి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా రెండుసార్లు ఒలింపిక్స్ లో పతాకాలను సాధించాడు. గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్ బంగారు పతకం సాధించాడు. ఆ తర్వాత పారిస్ లో రజతం సాధించాడు.
ఈ నేపథ్యంలో.. నీరజ్ చోప్రా ఒక ఇంటి వాడయ్యాడు. తాజాగా.. ఆయన పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. నీరజ్ చోప్రా, హిమానిని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. నీరజ్ ప్రస్తుతం కొత్త సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు.
బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ 2024లో ఆండర్సన్ పీటర్స్ తర్వాత రెండో స్థానంతో 2024 నీరజ్ చోప్రా సీజన్‌ను నిలిచాడు.
ఇదిలా ఉండగా.. నీరజ్ చోప్రా సతీమణి ప్రస్తుతం యూఎస్ఏలో చదువుకుంటుంది. చాలా రోజుల నుంచి వీరిద్దరు ఒకరంటే మరోకరి ఎంతో ఇష్టమంట. దీంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి పచ్చ జెండా ఊపేశాయి.
దీంతో ఈ రోజు నీరజ్, హిమానీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి బంధు,మిత్రులు పెద్ద ఎత్తున హజరయ్యారు. పెళ్లి కూడా ధూమ్ ధామ్ గా జరిగింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి.