Nayanthara: మళ్లీ వివాదంలో నయనతార..?.. ఇంత యాటిట్యూడ్ దేనీకంటూ నెట్టింట దుమారం.!. స్టోరీ ఏంటంటే..?


Nayanthara controversy: నయనతార ఫెమీ 9 పేరుతో ఇటీవల ఒక బిజినెస్ ను ప్రారంభించారు. అయితే.. దీనికి ప్రమోషన్ లలో భాగంగా.. ఒక ఈవెంట్ ను ప్లాన్ చేశారు.
 

1 /6

నయనతార ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారారని చెప్పుకొవచ్చు. హీరో ధనుష్ తో వివాదం మొదలైనప్పటి నుంచి తరచుగా ఏదో ఒక వివాదంతోనే వార్తలలో ఉంటున్నారు. ఇప్పటికే ధనుష్.. పది కోట్ల పరిహారం ఇవ్వాలని నోటీసులు పంపిన విషయం తెలిసిందే.  

2 /6

ఇక తాజాగా.. చంద్రముఖి సినిమా మేకర్స్ సైతం.. నయనతారకు నోటీసులు పంపినట్లు వార్తలు వచ్చాయి.కానీ  ఆ తర్వాత అవన్ని రూమర్స్ అని చంద్రముఖి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలో నయన్ మళ్లీ వార్తలలో నిలిచారు.  

3 /6

నయన తార ఇటీవల.. ఫెమీ 9 పేరుతో ఒక బిజినెస్ నుస్టార్ట్ చేశారు. దీనికి చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లను  ఆహ్వానించారు. అయితే.. ఈ కార్యక్రమానికి మొదట.. నయన్ దంపతులు.. ఉదయం తొమ్మిది గంటలకు ప్రొగ్రామ్ ను ప్లాన్ చేశారు. నటి చెప్పిన టైమ్ కు అందరు ఈవెంట్ కు వచ్చేశారు.  

4 /6

కానీ నయన్ దంపతులు మాత్రం.. తీరిగ్గా.. మధ్యాహ్నం మూడుగంటలకు వచ్చారు. ఆతర్వాత మాట్లాడి.. ఫోటోలు దిగుతూ అక్కడున్న అతిథులతో తమ బిజినెస్ గురించి చెప్పారు. అయితే.. అప్పటి వరకు ఎదురు చూసి ఎంతో మంది అతిథులు వెళ్లిపోయారు. అసలు ప్లాన్ ప్రకారం..ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటకు అయిపోవాలి.కానీ నయన్ వల్ల సాయంత్రం  ఆరు గంటలకు ముగిసింది.

5 /6

దీంతో ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సిన వారు.. తమ ట్రైన్, బస్సులు,ఫ్లైట్ లను మిస్ చేసుకున్నారంట. అయితే.. ఈ కార్యక్రమంలో అతిథులతో ఫోటోలు దిగుతూ.. తెగ హల్ చల్ చేశారు. కానీ ఇంత ఆలస్యంగా వచ్చినందుకు నయన్ దంపతులు మాత్రం కనీసం సారీ చెప్పలేదని అక్కడి వాళ్లు ఫైర్ అయ్యారు.

6 /6

చాలా మంది ఈ ప్రొగ్రామ్ డిలే వల్ల తమ ప్లానింగ్ లను మళ్లీ రీ షెడ్యూల్ చేసుకొవాల్సి వచ్చిందని.. డబ్బుల్ని, సమయంను నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నటి కనీసం హుందాగా ప్రవర్తించి సారీ చెప్పలేదని కూడా.. అతిథులు మండిపడ్డారు. మొత్తానికి ఈ వార్తవైరల్ గా మారింది. ఇలాంటి యాటిట్యూడ్ మంచిది కాదని కూడా.. నెటిజన్లు నయన్ దంపతులను ఏకీ పారేస్తున్నారు.