Home Based Small Business Ideas: ఇంట్లో ఉండే నెలకు రూ.50 వేలు సంపాదించాలనుకుంటున్నారా? రోజు 3 గంటల కష్టపడితే చాలు లాభాలే లాభాలు..

Latest Cake Business Idea: ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ చాలా పోటీగా ఉంది. అందుకే చాలా మంది ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడుతున్నారు. మరి కొందరూ ఉద్యోగాలలో జీతాలు సరిపోకపోవడం వల్ల చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సొంత వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చాలా మందికి వస్తుంది. చాలా మంది చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఇందులో స్వంత బాస్‌గా ఉండవచ్చు అలాగే పని గంటలు, పని చేసే విధానం మీరే నిర్ణయించుకోవచ్చు. ఎంత కష్టపడితే అంత ఎక్కువ సంపాదించవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాపారాలను ఇంట్లో నుంచి కూడా చేయవచ్చు. మహిళలకు కూడా ఈ చిన్న వ్యాపారాలు బోలెడు లాభాలను తీసుకువస్తున్నాయి. అయితే మీరు కూడా బిజినెస్‌ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా..? మీరు తెలుసుకొనే బిజినెస్‌ తో నెలకు రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకు సంపాదింవచ్చు. 

1 /10

నేటి కాలంలో ఉద్యోగాల గ్యాప్ లేదా సరైన ఉద్యోగం లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఉద్యోగాలు చేయడానికి సమయం లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగాల నుంచి దూరం అవుతున్నారు. 

2 /10

చాలా మంది మహిళలు కుటుంబ బాధ్యతలను మోస్తారు. ఇంటి పనులు, పిల్లల సంరక్షణ వంటివి వారి సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి. కానీ మీరు తెలుసుకొనే వ్యాపారంతో ఎలాంటి సమస్యలు లేకుండా సొంతంగా ఇంట్లోనే వ్యాపారం ప్రారంభించవచ్చు. 

3 /10

మహిళలు, యువత కూడా ఈ బిజినెస్‌ను స్టార్ట్‌ చేయవచ్చు. మీకు వంటలు లేదా బేకింగ్‌ మీద ఆసక్తి ఎక్కువగా ఉంటే ఈ వ్యాపారంలో మీ దశ తిరిగినట్లే. ఈరోజు తెలుసుకొనే వ్యాపారం ఇంట్లోనే కేక్‌ బిజినెస్‌ ఎలా ప్రారంభించాలి అనే ఆంశం. 

4 /10

ఈ వ్యాపారంతో మీరు నెలకు మంచి లాభాలు పొందవచ్చు. ఇది అతి తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు. మహిళ్లలకు సులభమైన బిజినెస్‌ ఐడియా. మీకు ప్రస్తుతం మార్కెట్‌లో ఎటువంటి కేక్‌లు అమ్ముతున్నారు. వాటికి ఉపయోగించే వస్తువులు మీద అవగహన ఉంటే సరిపోతుంది. 

5 /10

 మీ బిజినెస్‌కు మరింత లాభాలు తీసుకురావడంలో సోషల్‌ మీడియా కూడా ఎంతో సహాయపడుతుంది. మీరు తయారు చేసే కేక్‌లను పోస్ట్‌ చేస్తూ మరింత డబ్బులు సంపాదింవచ్చు. అలాగే బ్రాండ్‌ ను అందరికి తెలిసేలా చేయవచ్చు. 

6 /10

కేక్‌ బిజినెస్‌తో మొదట నెలకు రూ. 4 వేల నుంచి రూ. 10, 000 సంపాదింవచ్చు. ప్రజలకు మీ బ్రాండ్‌ , కేక్‌లు నచ్చుతే ప్రతి నెల  రూ. 30 వేల నుంచి రూ. 50 వేలు సంపాదించవచ్చు. 

7 /10

కేక్ బిజినెస్‌ను ఆకర్షణీయంగా మార్చడానికి, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ కేక్‌ల రుచి, రూపం, మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడం ద్వారా ఎక్కువ మందిని ఆకర్షించవచ్చు.

8 /10

 వివిధ రుచులు, డిజైన్‌లు, థీమ్‌లతో కూడిన కేక్‌లను అందించడం వల్ల  కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన పదార్థాలను ఉపయోగించి కేక్‌లను తయారు చేయండి.  

9 /10

కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కేక్‌లను కస్టమైజ్ చేయడానికి అవకాశం ఇవ్వండి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మీ కేక్‌ల ఫోటోలను పోస్ట్ చేయండి. కేక్ బిజినెస్‌కు ఒక వెబ్‌సైట్‌ను సృష్టించి, మీ కేక్‌ల గురించి, మీరు అందించే సేవల గురించి వివరణ ఇవ్వండి.

10 /10

 ఫుడ్ బ్లాగర్‌లతో కలిసి పని చేసి మీ కేక్‌లను రివ్యూ చేయించుకోండి. అలాగే ఫుడ్ ఫెస్టివల్‌లలో పాల్గొని మీ కేక్‌లను ప్రదర్శించండి. దీంతో పాటు వివిధ సందర్భాలలో సీజనల్ ఆఫర్‌లను అందించండి.