Nita Ambani - Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డిన్నర్ లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భారత సంప్రదాయంలో కాంచీపురం చీరను ఆమె ధరించారు. ఈ చీరలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే శతాబ్దాల కాలం నాటి అత్యంత విలువైన అభరణాలను కూడా ఆమె ధరించారు.
Nita Ambani - Donald Trump: మరికొన్ని గంటల్లో అమెరికా దేశ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం దేశ విదేశాల నుంచి అతిరథమహారధులు వాష్టింగన్ కు తరలివెళ్లారు. సోమవారం వారి కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక డిన్నర్ ఏర్పాట్లు చేశారు. ఈ డిన్నర్ రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీతోపాటు ఆయన భార్య నీతా అంబానీకూడా హాజరయ్యారు. అయితే ఈ డిన్నర్ లో నీతా అంబానీ ధరించిన చీర అందర్నీ ఆకట్టుకుంది.
కాంచీపురం నేతతో నలుపు రంగు చీరలో నీతా అంబానీ మెరిసిపోయారు. అలాగే బ్లాక్ కలర్ ఫ్లవర్ బ్లౌజుతోపాటు శతాబ్దాల నాటి ఆభరణాలను కూడా ఆమె ధరించారు. ప్రముఖ కళాకారుడు బి. క్రుష్ణమూర్తి ఈ చీరను నేశారు.
బ్లౌజును ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. మెడ, చేవులు, చేతికి పచ్చని పూసలు, రాళ్లతో పొదిగిన ఆభరణాలను ఆమె ధరించారు.
అలాగే చేతి మణికట్లుకు సైతం పచ్చని రాయితో తయారు చేసిన ఆభరణాన్ని ధరించి..ఈ డిన్నర్ లో నీతా అంబానీ మెరిసిపోయారు. స్వదేశీ వస్తువులను ఇలా ధరించడం వల్ల నీతా అంబానీ భారత్ పై ఉన్న తన అనుబంధాన్ని మరింత చాటిచెప్పారు.
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనవరి 18వ తేదీ నుంచి ముఖేష్ అంబానీ దంపతులు అమెరికా చేరుకున్నారు. అ తర్వాత దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న అయన్ను కలిసిన ఈ దంపతులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
కొత్త దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతూన్న ట్రంప్ సారథ్యంలో భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయని ముఖే అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.