NTPC Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నది మీ కల. అయితే, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష లేకుండానే రూ.1,40,000 పొందే అవకాశం మీ సొంతం, పూర్తి వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ అయిన careers.ntpc.co.in సందర్శించండి.
NTPC Recruitment 2025: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) అద్భుత అవకాశం కల్పిస్తోంది. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం కొట్టే ఛాన్స్ మీ సొంతం అవుతుంది. ఇంజినీర్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పొజిషన్ల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ నోటిఫికేషన్‌లో 475 ఖాళీలు భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
పూర్తి వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ అయిన careers.ntpc.co.in సందర్శించండి. నోటిఫికేషన్ క్షుణ్నంగా చదివిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13. ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈ పోస్టులకు ఎంపికైనవారు మన దేశంలోని వివిధ లొకేషన్‌లలో ట్రైనింగ్ అందిస్తారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత పోస్టింగ్ ఎక్కడ అనేది నిర్ధారిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, స్టేషన్స్‌లో వారిని రిక్రూట్ చేసే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు నైట్ షిప్ట్ కూడా చేయాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రికల్ 135, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రూమేషన్ 85 పోస్టులు, సివిల్ 50, మైనింగ్ 25 పోస్టుల భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 నుంచి రూ.1,40,000 జీతం అందుకుంటారు. ఇది కాకుండా డీఏ, అలవెన్సులు, టెర్మినల్ బెనిఫిట్స్ కూడా పొందుతారు.
ఎన్‌టీపీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఏఎంఐఈలో కనీసం 65 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం పొంది ఉండాలి. అంతేకాదు అభ్యర్థులు గేట్ (గ్రాడ్యూయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) 2004 రాసి ఉండాలి.