ఐఓఎస్‌లో యాపిల్ మొబైల్స్ ఎంతగా ఫేమసో.. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు కింగ్ మేకర్లుగా నిలుస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్‌ఫోన్ (oneplus Nord N10 5g) ఆవిష్కరించారు. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో వచ్చిన ఈ మొబైల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇటీవల ఐఫోన్ 12లో 5జీ తీసుకురాగా.. అందుకు పోటీగా ఆండ్రాయిడ్‌లో వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ లాంచ్ చేశారు.
ఐఓఎస్‌లో యాపిల్ మొబైల్స్ ఎంతగా ఫేమసో.. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు కింగ్ మేకర్లుగా నిలుస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్‌ఫోన్ (oneplus Nord N10 5g) ఆవిష్కరించారు. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో వచ్చిన ఈ మొబైల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇటీవల ఐఫోన్ 12లో 5జీ తీసుకురాగా.. అందుకు పోటీగా ఆండ్రాయిడ్‌లో వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ లాంచ్ చేశారు. (Photo Credit: Oneplus)
ఈ 5జీ మొబైల్‌లో 6.49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ ఉండటం విశేషం. మూడు రియర్ కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్. ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్.
ప్రస్తుతానికి 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో ఒక్క వేరియంట్‌ను వన్‌ప్లస్ లాంచ్ చేసింది. దీని ధర సుమారు రూ.32,000గా నిర్ణయించారు. మిడ్ నైట్ ఐస్ రంగులో ఈ ఫోన్ లభ్యం కానుంది.
ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్‌లో ఆక్సిజన్ ఓఎస్ 10.5తో వన్‌ప్లస్ నార్డ్ 10జీ 5జీ స్మార్ట్‌ఫోన్ పనిచేయనుంది.
ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్, స్టీరియో స్పీకర్ అందుబాటులో ఉంది. ఈ మొబైల్స్ మొదటగా యూరప్‌లో లాంచ్ చేశారు. త్వరలో భారత్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. (Photo: india.com)