IPO: ప్రైమరీ మార్కెట్లో డబ్బులు సంపాదించాలని ఉందా..? ఆగస్టు 21 నుంచి ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ IPO ప్రారంభం..

Orient Technologies Ltd : ఆగస్టు నెలలో లిస్ట్ అయిన దాదాపు అన్ని ఐపీవోలు కూడా ఇన్వెస్టర్ల పంట పండించాయి.ఈవారం లిస్ట్ అయినా ఫస్ట్ క్రై ఐపీవో ఇన్వెస్టర్లకు 34 శాతం లాభం అందించగా,  అదే రోజు లిస్ట్ అయినా యూనికామర్స్  ఈ సొల్యూషన్స్ ఐపీవో 113 శాతం లాభాన్ని అందించింది. ఓలా ఎలక్ట్రిక్, ఈస్థటిక్ ఇంజనీర్స్, పిక్చర్ పోస్ట్ స్టూడియోస్ వంటి సంస్థలు మంచి రాబడిని అందించాయి. అయితే  ఇప్పుడు మరోసారి మీరు ఐపీఓ ద్వారా అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా. 

1 /5

అయితే ప్రముఖ ఐటి సొల్యూషన్స్ కంపెనీ ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ IPO ఆగస్టు 21న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. మీరు కూడా IPOలోఅదృష్టం పరీక్షించుకోవాలంటే, మీ  డబ్బును సిద్ధం చేసుకోండి. ఈ కంపెనీ 215 కోట్ల రూపాయల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ)ను ప్రవేశపెట్టింది. దీని  ధర బ్యాండ్ విషయానికి వస్తే ఒక్కో షేరుకు రూ.195-206గా నిర్ణయించారు. ఈ విషయాన్ని కంపెనీ శుక్రవారం వెల్లడించింది.  

2 /5

IPO ఆగస్ట్ 23న ముగుస్తుంది: ఈ ఐపీవో బిడ్డింగ్ ఆగస్టు 21న ప్రారంభమై ఆగస్టు 23న ముగుస్తుందని కంపెనీ తెలిపింది. IPO కింద, ఓరియంట్ టెక్ రూ. 120 కోట్ల విలువైన కొత్త షేర్లను ఆఫర్ చేస్తోంది. ప్రమోటర్ల వద్ద ఉన్న రూ. 95 కోట్ల విలువైన 46 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. తద్వారా ఇష్యూ మొత్తం పరిమాణం రూ.215 కోట్లు అవుతుంది. కొత్త షేర్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మూలధన వ్యయం, నవీ ముంబైలోని కార్యాలయ ఆఫీసులను కొనుగోలు చేయడం  సాధారణ కంపెనీ అవసరాల కోసం ఉపయోగిస్తుంది.  

3 /5

ఓరియంట్ టెక్నాలజీస్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)  ITES, హెల్త్‌కేర్  ఫార్మాస్యూటికల్ పరిశ్రమలలో ప్రభుత్వ,  ప్రైవేట్ రంగాలలో కస్టమర్లను కలిగి ఉంది. ఓరియంట్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూలో 50% షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు (QIBs), 15% నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NIIలు)  35% రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించింది.  

4 /5

షేర్ ఎప్పుడు లిస్టింగ్ ఎప్పుడు..?  ఓరియంట్ టెక్నాలజీస్ IPO లాట్ పరిమాణం కనీసం 72 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో లాట్ రూ. 14,832 మినిమం బిడ్ చేయాల్సి ఉంటుంది. ఓరియంట్ టెక్నాలజీస్ ఐపీఓకు సంబంధించిన షేర్ కేటాయింపు ఆగస్టు 26న ఖరారు కానుంది.   

5 /5

రీఫండ్ ప్రక్రియ ఆగస్టు 27న ప్రారంభమవుతుంది  రీఫండ్ తర్వాత అదే రోజున కేటాయించిన వారి డీమ్యాట్ ఖాతాలకు షేర్లు జమ చేయనున్నారు. ఓరియంట్ టెక్నాలజీస్ షేర్లు ఆగస్టు 28వ తేదీన మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.