Parle G: పిల్లల్నించి పెద్దల వరకూ అందరికీ సుపరిచితమైన బిస్కట్ అంటే ఒకే ఒకటి పార్లే జి బిస్కట్స్. బిస్కట్ అంటే చాలు పార్లేనే గుర్తొస్తుంది. దేశంలో Parle G అనేది బిస్కట్లలో ఓ బ్రాండ్. ఈ బిస్కట్ కంపెనీ గురించి ఎవరికీ తెలియని, ఆసక్తి కల్గించే అంశాలు చాలా ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
కంపెనీ థర పెంచకుండా ప్యాకేజ్ బరువు తగ్గించడం చేసింది. పార్లే జి ప్రారంభంలో 100 గ్రాముల బరువుండేది. ఆ తరువాత 92 గ్రాములైంది. ఆ తరువాత 88 గ్రాములకు మారింది. ఇప్పుడు కేవలం 50 గ్రాముల్లో లభిస్తోంది. అంటే 1994 నుంచి ఇప్పటి వరకూ 45 శాతం బరువు తగ్గించింది. లాభాల కోసం ధర పెంచకుండా బరువు తగ్గించడం చేసింది. ఇదొక రకమైన మార్కెటింగ్ వ్యూహం. కంపెనీ మార్కెట్ విలువ ఇప్పుడు 17 వేల 223 కోట్లుగా మారింది.
30 ఏళ్లలో కేవలం రూపాయి పెరిగిన ధర పార్లే జి ధరే ఆ కంపెనీకు అతిపెద్ద ప్లస్ పాయింట్. అందుకే గత 30 ఏళ్లలో ఒకే ఒకసారి కంపెనీ బిస్కట్ ధర పెంచింది. అది కూడా కేవలం 1 రూపాయి మాత్రమే. 1994లో కంపెనీ పార్లే జి చిన్న ప్యాకెట్ ధరను 4 రూపాయల్నించి 5 రూపాయలు చేసింది. ఇప్పటికే అదే ధర.
1982లో పార్లే గ్లూకోను పార్లే జి పేరుతో రీ ప్యాక్ చేసి మార్కెట్ చేసింది కంపెనీ. ఇందులో జి అంటే గ్లూకోజ్. పార్లే జి ప్రకటనలు టీవీల్లో, రేడియోల్లో, వార్తా పత్రికల్లో వచ్చేవి.
పార్లే ప్రకటనల్లో కన్పించే పార్లే గర్ల్ జనం మదిలో నిలిచిపోయింది. 1960లో వరకూ చాలా రకాల కంపెనీలు గ్లూకోజ్ బిస్కట్లు లాంచ్ చేశాయి. క్రమంగా పార్లే జి అమ్మకాలపై ప్రభావం పడసాగింది. ప్యాకింగ్ మార్చింది. పసుపు రంగు వ్యాక్స్ పేపర్లో చుట్టి మార్కెట్ చేసింది. ఈ ప్యాక్‌పై పార్లే జి బ్రాండ్‌తో పాటు చిన్నమ్మాయి ఫోటో స్పష్టంగా కన్పిస్తుంది.
పార్లే జి బిస్కట్ ధర భ్రిటీష్ స్నాక్స్ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో ప్రవేశించిన పార్లే జి అనతికాలంలోనే ప్రసిద్ధికెక్కింది. ధర తక్కువగా ఉండి, రుచిగా ఉండటం వల్ల మార్కెట్లో క్లిక్ అయింది. 2011 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా విక్రయమయ్యే బిస్కట్గా పేరుగాంచింది. మద్యలో చాలా ఆటుపోట్లు కూడా సంభవించాయి. స్వాతంత్ర్యం తరువాత కరవు సంభవించి గోధుమల కొరత ఏర్పడింది. ఆ సమయంలో గోధుమలు కాకుండా జొన్న ఉపయోగించారు. అమ్మకాలు తగ్గడంతో ప్రకటనలు ఇచ్చుకుని పార్లే గర్ల్ ప్రారంభించాడు.
60 వేలతో మెషీన్ కొనుగోలు దేశంలో చాలామంది పేదరికంతో ఉండటం వల్ల ఖరీదైన బ్రాండెడ్ బిస్కట్లు కొనలేకపోవడాన్ని మోహన్ లాల్ గమనించాడు. అందుకే దేశీయంగా చౌకగా బిస్కట్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. జర్మనీ వెళ్లి బిస్కట్లు తయారు చేయడం ఎలాగో నేర్చుకున్నాడు. ఆ తరువాత 60 వేలు ఖర్చు పెట్టి మెషీన్ కొనుగోలు చేశాడు. 1920లో పార్లే గ్లూ ప్రారంభించాడు. ఐదుగురు కుమారులు మాణిక్ లాల్, పీతాంబర్, నరోత్తమ్, కాంతిలాల్ , జయంతీలాల్లు పార్లే వ్యవస్థాపకులు.
ఓ టైలర్ ప్రారంభించిన కంపెనీ 1900 సంవత్సరంలో 12 ఏళ్ల యువకుడు గుజరాత్‌లోని వల్సాడ్ నుంచి ముంబైకు వచ్చాడు. కడుపు నింపుకునేందుకు టైలరింగ్ షాపులో పనిచేసేవాడు. టైలరింగ్ నేర్చుకున్నాడు. 18 ఏళ్ల వయస్సులో ముంబైలోని గాందేవీ ప్రాంతంలో సొంతంగా టైలరింగ్ షాపు ప్రారంభించాడు. టైలరింగ్ పనితో బాగానే సంపాదించేవాడు. కొన్ని నెలల్లోనే తన పేరుతో డీ మోహన్ లాల్ అండ్ కంపెనీ ప్రారంభించాడు. ఆ తరువాత పార్లే జి ప్రారంభించాడు.