Pet Snakes: భయం అవసరం లేదు.. ఈ ఐదు పాములను ఇంట్లో పెంచుకోవచ్చు

These Five Snake Species Kept As Pet Animals: పాములు కనిపిస్తేనే గుండెలు అదురుతాయి. ఎక్కడో ఒక చోట పాము కనిపిస్తే తుర్రున పారిపోతాం. మరి అలాంటిది పాములను పెంచుకోవడం అనే ఆలోచన వస్తే. అసలు పాములను పెంచుకోవచ్చా? ఏ పాములను పెంచుకోవచ్చు? అనే వివరాలు తెలుసుకుందాం.

1 /6

పాములు అనేవి మానవ జాతిని భయపెట్టిస్తాయి. కాటేసే పాము.. విషపూరిత పాము ఏదో తెలియదు. దీంతో అన్ని పాములకు భయపడతాం. అయితే పాములను ఇంట్లో కుక్క, పిల్లిని పెంచుకున్నట్టు పెంచుకోవచ్చు. పాములను పెంచుకోవడం కూడా కొందరికి హబీ. అయితే భారతదేశంలో మాత్రం పాములను పెంచుకోవడం నేరం. పెంపుడు జంతువులుగా పాములను పెంచుకోరాదు. అమెరికా, కెనడా, బ్రిటన్‌ వంది దేశాల్లో పాములను పెంపుడు జంతువుగా చేసుకోవచ్చు.

2 /6

కార్న్ స్నేక్: ఈ పాములు సాధు స్వభావం కలిగినవి. వివిధ రంగుల్లో ఈ పాములు ఉంటాయి. ఈ పాములను ఎలాంటి భయం లేకుండా పెంచుకోవచ్చు. పసుపు, బంగారం రంగులో మచ్చలు మచ్చలు కలిగి ఉన్న ఈ కార్న్‌ పామును ఇంట్లో కుక్క, పిల్లి మాదిరి ఉంచుకోవచ్చు.

3 /6

బాల్ పైథాన్: సున్నితమైన స్వభావం కలిగిన బాల్ పైథాన్‌లను భయం లేకుండా వాటిని పోషించవచ్చు. అందమైన రంగులో చూడముచ్చటగా ఉంటాయి. ఈ పాములు ఒత్తిడికి గురైనప్పుడు బంతిలా చుట్టుకుంటాయి. దీని ప్రవర్తన ఆసక్తికరంగా ఉంటుంది.

4 /6

కాలిఫోర్నియా కింగ్స్‌ స్నేక్‌: ఈ పాములు ఇంట్లో పెంచుకోవడానికి అనుగుణంగా ఉంటాయి. బలంగా.. ఎంతో ఉత్సాహంగా ఈ పాములు ఉండడం విశేషం. ఇది పాము ప్రియులకు అత్యంత ఇష్టమైనది. కాలిఫోర్నియా కింగ్స్‌ పామును భయపడకుండా పెంచుకోవచ్చు.

5 /6

గార్టర్ స్నేక్: గార్టర్ అనే పేరు కలిగిన ఈ పామును పెంపుడు జంతవుగా చేసుకోవచ్చు. ఇది చిన్న పరిమాణంలో ఉండి విషపూరితం కావు. వివిధ రంగులలో ఈ పాములు ఉంటాయి. వీటిని పెంచడం చాలా సులువు. వీటిని ఒక గదిలో బంధించుకోవచ్చు.

6 /6

రెడ్ టెయిల్డ్ బోవా: ప్రశాంతంగా ఉండే రెడ్‌ టెయిల్డ్‌ పామును పోషించడం చాలా సులభం. అందమైన గుర్తులతో అత్యంత సున్నితంగా ఉండే ఈ పామును ఇంట్లో పెంచుకోవచ్చు.