Garuda puranam: సనాతన ధర్మంలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా మరణానంతరం గరుడ పురాణాన్ని అనుసరిస్తారు.
Garuda puranam: 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. విష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను వివరించాడని నమ్ముతారు. ఈ పురాణంలో (Garuda puranam) మరణం గురించి...ఆ తర్వాత వచ్చే జన్మ గురించిన చర్చ ఉంది. జీవితం యెుక్క అనేక రహస్యాలు ఇందులో పొందుపరచబడ్డాయి. తరువాత వ్యక్తుల కర్మల ఫలితాలు.. ఆత్మ దిక్కుతోచని స్థితి నుండి పునర్జన్మ పొందడం వరకు ఉన్న పరిస్థితులు గరుడ పురాణంలో స్పష్టంగా వివరించారు. ఈ పురాణాన్ని అనుసరించి..ఐదు నియమాలు ఆచరిస్తే... మీ జీవితం ఆనందంగా ఉంటుంది. అవేంటో చూద్దాం.
నిరుపేదలకు ఆహారం అందించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని గరుడ పురాణం చెప్పబడింది. మీ సామర్థ్యం మేరకు...అవసరమైన వారికి దానం చేయండి.
ఈ పురాణం ప్రకారం, భోజనానికి ముందు దేవునికి నైవేద్యం పెట్టండి. ఆ విధంగా చేస్తే...ఇంట్లో ఆహారానికి, డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండదు.
తపస్సు, ధ్యానం మొదలైన వాటి ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. దీని ద్వారా కోపం అదుపులో ఉంటుంది. అందుకే మనిషి ఆలోచన చేస్తూనే ఉండాలి.
గరుడ పురాణం ప్రకారం, ప్రతి వ్యక్తి జ్ఞాన సముపార్జన చేసుకోవాలి. దాని కోసం మతపరమైన గ్రంథాలను పఠించాలి.
కులదేవతను పూజిస్తే మీకు మంచి జరుగుతోంది. అలా చేయడం ద్వారా రాబోయే ఏడు తరాలు సంతోషంగా ఉంటాయట.