Plant Repellants At Home: ఈ వర్షాకాలంలో ఈగలు, దోమల విపరీతంగా విజృంభిస్తాయి. అయితే ఇంటి చుట్టూ దరిదాపుల్లో కొన్ని మొక్కలు నాటుకుంటే మీ ఇంట్లోకి దోమలు, ఈగలు, ఎలుకలు రావు ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందాం.
ఈ సీజన్లో దోమలు విజృంభిస్తే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయి. ఎలుకల వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇవి విపరీతంగా మన వంట గదుల్లో కనిపిస్తాయి.
ఇంట్లో ఇంటి పరిసర ప్రాంతాల్లో పుదీనా మొక్కను నాటుకుంటే బల్లులు దరిదాపుల్లోకి రావు. అలాగే ఎలుకలు కూడా ఈ వాసన నచ్చదు. సాధారణంగా పుదీనాను వంటల్లో వినియోగిస్తాం.
లెమన్ గ్రాస్ టీ రూపంలో తీసుకుంటారు అయితే లెమన్ గ్రాస్ ని కూడా మీ ఇంటి చుట్టు పరిసర ప్రాంతాల్లో నాటుకుంటే బల్లులకు వికర్షగాలుగా పనిచేస్తాయి.
బంతి పువ్వు కూడా ఎఫెక్టివ్ రెమిడిగా పని చేస్తుంది. క్రిమిసంహార మందుల్లో ఉపయోగిస్తారు దీని వాసన బల్లులకు నచ్చదు.
అంతేకాదు రోజ్మెరీ మొక్కను చూసి కూడా దరిదాపుల్లోకి కూడా బల్లులు ఈగలు దోమలు రావు. వీటి వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయి.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)