Pm Kisan: పీఎం కిసాన్‌ కొత్త రైతుల రిజిస్ట్రేషన్‌ ఎలా? స్టెప్‌ బై స్టెప్‌ విధానం ఇదే..

PM Kisan New Farmers Registration: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన (PMKSY) 19వ విడుత నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24వ తేదీ బీహార్‌ భగల్పూర్‌ వేదికగా విడుదల చేయనున్నారు. తద్వారా రైతుల ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) ద్వారా రూ.2000 జమా అవుతాయి. అయితే, కొత్తగా పీఎం కిసాన్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

పీఎం కిసాన్‌ నిధి సమ్మాన్‌ యోజన ద్వారా ప్రతి ఏడాది రైతులు రూ.6000 పొందుతున్నారు. ఇది మూడు విడుతల్లో రూ.2000 చొప్పున పొందుతున్నారు. అయితే, ముందుగానే ఈ పథకానికి రిజిస్టర్‌ చేసుకున్నవారు అర్హులు.  

2 /5

ఇది కాకుండా ముందుగానే కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత నిధులు జమా అవుతాయి. లబ్దిదారుల స్టేటస్‌ చెక్‌ చేసుకునే సౌలభ్యం కల్పించారు. మొబైల్‌ నంబర్‌తో చెక్‌ చేసుకోవచ్చు.  

3 /5

అయితే, కొత్తగా పీఎం కిసాన్‌ రిజిస్టర్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనికి Pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మీ ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.  

4 /5

Get OTP ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేసి ఎస్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఒక రిజిస్ట్రేషన్‌ ఫారమ్ వస్తుంది. అందులో మీ వివరాలు నమోదు చేయాలి.  

5 /5

మీ వద్ద ఆధార్‌, మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతా, భూరికార్డులు కలిగి ఉండాలి. అంతేకాదు మీ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ కార్డు లింక్‌ చేసి ఉండాలి. తద్వారా డీబీటీ ద్వారా డబ్బులు జమా అవుతాయి. అన్ని ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేసి చివరగా సబ్మిట్‌ కొట్టాలి. మీ రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది.