PM Kisan Samman Nidhi | రైతులకు భరోసా కల్పించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Scheme). కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. రైతులకు ప్రతి ఏడాది మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.

PM Kisan Scheme : పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో భాగంగా మూడు దఫాలుగా రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.2000 చొప్పున మొత్తం 6వేల నగదు జమ చేస్తారు. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు రైతుల ఖాతాలకు రూ.2 వేలు జమ చేయనున్నారు. ప్రస్తుతం రైతులు 8వ విడత రూ.2000 నగదు కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది.
2021లో తొలి విడత చెల్లింపులు మే 14వ తేదీన రైతుల ఖాతాల జమ కానుందని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేయనుందని స్పష్టత వచ్చింది. ఈ ఏడాది పీఎం కిసాన్ పథకంలో భాగంగా అమలు చేస్తున్న కొత్త రూల్స్ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు రూ.2000 అందుతుంది. నేరుగా రైతుల ఖాతాలలో నగదు జమ అవుతుంది.
పీఎం కిసాన్ పథకం (PM Kisan Samman Nidhi)లో భాగంగా 8వ దఫాలో మొత్తం 9.5 కోట్ల మంది రైతులు లబ్దిదారులుగా ఉన్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు దాదాపు కోటి మంది లబ్ధిదారులు తగ్గిపోయారు. సవరించిన నియమాలే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది తొలి దఫా చెల్లింపులు చేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ కసరత్తు పూర్తి చేసింది. మే 14 నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కానున్నట్లు తెలుస్తోంది.
8వ విడత పీఎం కిసాన్ నిధి జమ వివరాలు రైతులు ఇలా తెలుసుకోవచ్చు. రైతులు http://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్ వెబ్సైట్లో Farmer Cornerకు వెళ్లాలి. ఆ తర్వాత Beneficiary Status మీద క్లిక్ చేయాలి. తమ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే లబ్ధిదారుల ఖాతా వివరాలు కనిపిస్తాయి.