Poori making process: చాలా మంది పూరీలను ఎంతో ఇష్టంతో తింటారు.కానీ పూరీలు చేయడం మాత్రం అంత ఈజీ కాదని చెప్పు కొవచ్చు.
చాలా ప్రదేశాలలో పూరీలను ఎంతో ఇష్టంతో తింటారు. పూరీలను ఉదయంపూట బ్రేక్ ఫాస్ట్ ల మాదిరిగా తింటుంటారు. చిన్న పిల్లలు, పూరీఆలును ఎంతో ఇష్టంతొ తింటారు.
పూరీల కొసం ముందుగా గోధుమ పిండిని రెడీగా పెట్టుకొవాలి. అంతే కాకుండా.. ఒక పెద్ద బెసన్ తీసుకుని దానిలో గోధుమ పిండిని వేసుకొవాలి. ఆతర్వాత బాగా కలపాలి.
గోధుమ పిండిలో నీళ్లు, పాలను పోసి చక్కగా పిండి ముద్దలా అయ్యేవరకు మెత్తగా చేతులతో కలపాలి. దీనిలో సోడా వేయాలి. కాసింత నూనె కూడా వేయాలి. ఒక పదినిముషాల పాటు అలా పెట్టాక ఉండలుగా చేసుకొవాలి.
ఈ ఉండలను చపాతీ మేకర్ బోర్డు మీద రౌండ్ గా వచ్చేలా చేసుకొవాలి. ఆ తర్వాత గ్యాస్ మీద స్టౌవ్ వెలిగించి దాని మీద కడయ్ పెట్టుకొవాలి. దానిలో నూనెను పోసి బాగా వేడయ్యే వరకు చూడాలి.
నూనె మరిగిన తర్వాత అందులో పూరీలను వేయాలి. వేశాక ... గంటల జాలీతో పూరీలను నూనెలోబాగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత.. పూరీలు బాగా పొంగే వరకు వెయిట్ చేయాలి.
ఆ తర్వాత మెల్లగా మరో ప్లేట్ లోకి వేయాలి. పూరీలకున్న నూనెమొత్తంగా జారీపోయే వరకు మాత్రం వేచీ చూడాలి. ఆ తర్వాత మాత్రం పూరీల్ని తినేయవచ్చు.
పూరీ పిండి నానబెట్టేటప్పుడు కొంత మంది వేడీ నీళ్లను వేసి కలపడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ పని మాత్రం అస్సలు చేయోద్దు. దీని వల్ల పూరీలు విరిగిపోతాయి. పైన చెప్పిన విధంగా పూరీలు చేస్తే.. గుల్లలా రౌండ్ గా పొంగుతాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)