Investments: నిర్దిష్ట కాలపరిమితితోపాటు ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ పొందే అవకాశాన్ని రకరింగ్ డిపాజిట్లు కల్పిస్తాయి. అయితే నెలకు కేవలం రూ. 5వేలు పెట్టుబడి పెట్టి మీ సంపదను రెట్టింపు చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Investments: పోస్టాఫీస్ ఎన్నో రకాల సేవింగ్స్ స్కీమ్స్ ను అందిస్తోంది. కస్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తూ పొదుపు పథకాల్లో పోస్టల్ డిపార్ట్ మెంట్ అమలు చేస్తున్న రికవరింగ్ డిపాజిట్ స్కీమ్స్ కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. బ్యాంకులతో పోల్చితే పోస్టాఫీసులోనే ఈ స్కీమ్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. నిర్దిష్ట కాలపరిమితితో ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ రిటర్న్స్ పొందే అవకాశాన్ని రికవరింగ్ డిపాజిట్లు కల్పిస్తున్నాయి. నెలకు కేవలం రూ. 5వేల పెట్టుబడి పెట్టి మీ సంపదను భారీగా పెంచుకునే అవకాశం ఉంటుంది.
పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ల కాలపరిమితి కనీసం 5ఏళ్లు. అంటే క్రమం తప్పకుండా నెలలవారీగా ఐదేళ్లపాటు రికరిండ్ డిపాజిట్ అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు కూడా రికరింగ్ డిపాజిట్ ఖాతా తీసుకుంటే ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఐదేళ్లపాటు నిరంతరాయంగా కడుతామనుకుంటేనే ఈ ఖాతాను తీసుకోవాలి
ఐదేళ్ల గడువు ముగిసిన తర్వాత మెచ్యూరిటీ పూర్తయ్యాక ఈ కాలపరిమితి మరింత పెంచుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అకౌంట్ హోల్డర్లు టెన్యూర్ ను మరో 5ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ గరిష్ట కాలపరిమితి 10ఏళ్లు. పదేళ్లు నిండిన తర్వాత ఇక పొడిగించుకునేందుకు వీలుండదు.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీములో డిపాజిట్ మొత్తంపై ప్రత్యేకమైన నిబంధన లేదు. కనీసం రూ. 100 అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా రూ. 1.50లక్షల వరకు ఎంతైనా డిపాజిట్ చేసుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది. 10 మల్టిపుల్స్ లో డిపాజిట్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది. అంటే స్కీమ్ లో చేరిన వారు నెలకు రూ. 110, రూ. 130 అలా డిపాజిట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా అకౌంట్ ఓపెన్ చేసిన నాటితో సహా మొత్తంగా 60 డిపాజిట్లు చేయాలి. ఒక నెలలో 1-15 తేదీల మధ్య స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేస్తే వచ్చే నెల 15వ తేదీలోపు తదుపరి డిపాజిట్ చేయాలి. 16 తర్వాత చేస్తే వచ్చేనెలలో 16 నుంచి నెలాఖరు మధ్య ఎప్పుడైనా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇక బ్యాంకుల రికరింగ్ డిపాజిట్ తో పోలిస్తే పోస్టాఫీసులో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆర్డీ స్కీములపై 6.7 శాతం వార్షిక వడ్డీరేటు అమలు అవుతోంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని కాంపౌండ్ చేసి డిపాజిట్ మొత్తంలో కలుపుతారు. ఈ అకౌంట్ ని ఎవరైనా ఓపెన్ చేయోచ్చు. మైనర్లు అయితే జాయింట్ అకౌంట్ కింద ఖాతా తెరవాలి. ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా కూడా ఆన్ లైన్ లో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఓపెన్ చేయోచ్చు.
ప్రతినెల రూ. 5 ఆర్డీఅకౌంట్లో జమ చేసుకుంటూ పోతే ఐదేళ్లు నిండిన తర్వాత డబ్బు రూ. 3,00, 000 అవుతుంది. దీనికి 6.7శాతం వడ్డీతో రూ. 56,830 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ పూర్తయ్యాక మొత్తంగా రూ. 3,56,830 చేతికి అందుతుంది. ఇదే అమౌంట్ ని 10ఏళ్ల పాటు పెట్టుబడి చేస్తే రూ. 6లక్షలకు గాను రూ.2, 54, 272 వడ్డీ అవుతుంది. మొత్తంగా మెచ్యూరిటీ పూర్తయ్యాక రూ. 8, 54, 272 అకౌంట్లో జమ అవుతుంది.