Post Office Scheme: నెలకు రూ. 5వేలు జమ చేస్తే చాలు..మీ చేతికి రూ. 8.50లక్షలు..ఈ బంపర్ స్కీమ్ గురించి తెలుసా?

Post Office Scheme: డబ్బు సంపాదించడమే కాదు..దానిని ఎలా పొదుపు చేయాలనేది కూడా తెలిసి ఉండటం చాలా ముఖ్యం. అయితే పోస్టాఫీస్ ఆర్డీ స్కీముతో ఆకర్షణీయమైన రాబడిని పొందవచ్చు. నెలకు రూ. 5వేలు చొప్పున జమ చేసినట్లయితే చేతికి రూ. 8,50లక్షలు అందుతాయి. ఈ స్కీము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

1 /6

Post Office Scheme:  దీర్ఘకాలం పాటు పొదుపు చేయాలని భావించే వారికి పోస్టాఫీస్ పొదుపు స్కీమ్ చాలా మంచివి. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లు మంచి రాబడిని అందిస్తాయి. కనిష్టంగా ప్రతినెలా రూ. 100 చొప్పున కూడా రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు ప్రతినెలా రూ. 5 వేలు చొప్పున పోస్టాఫీస్ ఆర్డీ స్కీములో  జమ చేస్తే కొన్నేళ్ళ తర్వాత అవి ఏకంగా రూ. 8.54 లక్షలు జమ అవుతాయి. ఎలా తెలుసుకుందాం.   

2 /6

ఉదాహరణకు మీరు ప్రతి నెల రూ. 5000 చొప్పున పోస్ట్ ఆఫీస్ ఆర్డి స్కీమ్ లో జమ చేశారని అనుకుంటే.. అప్పుడు ఏడాదికి రూ. 60000 రూపాయలు జమ అవుతాయి. ఐదేళ్లలో మూడు లక్షలు జమవుతాయి.   వీటిపై ఐదేళ్లలో 6.7% చొప్పున వడ్డీ రేటు వడ్డీ ఆదాయం మీకు లభిస్తుంది.  అవి దాదాపు రూ. 56,830 అవుతాయి.

3 /6

 ఒకవేళ మీరు ఈ స్కీంను మరో ఐదేళ్లపాటు కొనసాగిస్తే మరింత ప్రయోజనం పొందవచ్చు. ఇంకో 5 ఏళ్లలో మీరు ఈ స్కీం లో జమ చేసిన మొత్తం 6 లక్షలకు చేరుతుంది. 6.7% వడ్డీ కలుపుకొని అక్షరాల మీ చేతుకు.8,54,272 అందుతుంది.   

4 /6

ఈ పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ లో మనం ఎంతైతే జమ చేశామో.. ఆ మొత్తం 50% గా లోన్ తీసుకోవచ్చు. డిపాజిట్ పై మీకు లభించే వడ్డీ రెండు శాతం ఎక్కువగా విధిస్తారు. అయితే ఈ స్కీమ్లో కనీసం కొన్ని ఏళ్ల పాటు కొనసాగిన తర్వాతే రుణం పొందే అవకాశం లభిస్తుంది.  

5 /6

 ఈ స్కీం నుంచి మనం ఇష్టం వచ్చినప్పుడు వైదొలగలేము. కనీసం మూడేళ్ల తర్వాత ఈ స్కీమ్ నుంచి వైదొలగవచ్చు.  పోస్ట్ ఆఫీస్ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే తీసుకొచ్చిన ఆ స్కీం పేరు బాల జీవన్ బీమా పథకం లో పెట్టుబడి పెట్టాలనుకున్నవారు వారి ఆర్థిక స్థోమత బట్టి కనిష్టంగా రోజు  రూ. 6  నుంచి గరిష్టంగా 18 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు

6 /6

తల్లిదండ్రులు వారి పిల్లల పేరు మీద ఈ స్కీంలో పొదుపు చేసుకోవచ్చు. బాల జీవన్ బీమా పథకంలో 5 నుంచి 20 ఏళ్లలో పిల్లల పేరు మీద పొదుపు చేసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే తల్లిదండ్రుల వయస్సు  40 సంవత్సరాలు మించి ఉండకూడదు.