Anchor Chaitra Vasudevan Second Marriage: నటిగా.. యాంకర్‌గా ఆడియన్స్‌ను మెప్పించారు యాంకర్ చైత్ర వాసుదేవన్. కన్నడ టాప్ యాంకర్లలో ఆమె కూడా ఒకరు. 2023లో మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. తాజాగా రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని చైత్ర వాసుదేవన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
యాంకర్ చైత్ర తన కొత్త ప్రయాణం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. "నేను సంతోషకరమైన వార్తను పంచుకోవాలనుకుంటున్నాను. 2025లో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. ఇది నా వివాహ జీవితంలో ఒక బ్యూటీఫుల్ న్యూ జర్నీ. మీ అందరి ఆశీస్సులు నాపై ఉండాలి." అని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.
పారిస్‌లో జరిగిన తన కాబోయే భర్తతో తన ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌ను చూసి తరువాత చైత్ర వాసుదేవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
మొదట బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తరువాత యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.
ఆమె డిగ్రీ పూర్తి చేసిన వెంటనే.. ఇంట్లోవాళ్లు చూసిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఐదేళ్లు తరువాత 2023లో భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయారు.
"డిగ్రీ పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకున్నాను. మా కుటుంబం చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. అతను నన్ను మోసం చేశాడు. నా జీవితం ఇలా మారుతుందని నాకు తెలియదు. మా తల్లిదండ్రులు కూడా చాలా షాక్ అయ్యారు’’ అని గతంలో చైత్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తాజాగా రెండో పెళ్లి గురించి ప్రకటన చేసి.. అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. అయితే వరుడి వివరాలను ఆమె బయటకు చెప్పలేదు. పెళ్లి ప్రకటనతో యాంకర్‌కు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.