Pradhan Mantri Ujjwala Yojana: దారిద్య్ర రేఖకు (BPL) దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లను కల్పించడానికి పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 1 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. మరో కోటి మంది లబ్ధిదారులకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ అందించనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, బీపీఎల్ పరిధిలోకి వచ్చే కుటుంబాలు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు.
త్వరలో ఒక కోటి మహిళలు ఉజ్వల పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్లను ఉచితంగా అందిస్తుంది. ఈ పథకం కింద మొత్తం 8 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత LPG కనెక్షన్లు అందించనున్నారు.
ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద భారత ప్రభుత్వం రూ.1600 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తం ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కొనుగోలు ఉంటుంది. తొలిసారి స్టవ్ కొనుగోలు చేయడానికి మరియు సిలిండర్లను మొదటిసారిగా నింపడానికి అయ్యే ఖర్చులను భరించటానికి ఈఎంఐ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందడానికి బీపీఎల్ కుటుంబానికి చెందిన ఒక మహిళ మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం KYC ఫారమ్‌ను నింపి సమీపంలోని LPG కేంద్రంలో ఇవ్వాలి. దరఖాస్తు చేసేటప్పుడు, మీరు 14.2 కిలోల సిలిండర్ లేదా 5 కిలోలు తీసుకోవాలనుకుంటున్నారా అని తెలపాలి. వెబ్సైట్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఎల్పీజీ కేంద్రం నుంచి అయిన పొందవచ్చు.
ఈ పథకం కోసం దరఖాస్తు కోసం ఈ పత్రాలు అవసరం. బీపీఎల్ కార్డ్, బీపీఎల్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటరు ఐడి, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, రేషన్ కార్డ్ కాపీ, గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరించిన సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్, ఎల్ఐసీ పాలసీ, బ్యాంక్ స్టేట్మెంట్, పంచాయతీ అధికారి లేదా మున్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అనుమతి పొందిన బీపీఎల్(BPL) జాబితాలో పేరు ఉండాలి.