PV Sindhu: సీఎంగా జగన్‌ ఇచ్చిన భూమిలో పీవీ సింధు అకాడమీకి భూమి పూజ

PV Sindhu Laid Foundation His Badminton Academy In Vizag: అంతర్జాతీయ స్థాయిలో భారత పతకాన్ని రెపరెపలాడించి రెండు ఒలంపిక్‌ పతకాలు కొల్లగొట్టిన పీవీ సింధు తన అకాడమీ నిర్మాణ పనులు ప్రారంభించింది. నాటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖపట్టణంలో కేటాయించిన స్థలంలో సింధు తన అకాడమీని నిర్మించనుంది.

1 /6

భూమి పూజ: తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు తన బ్యాడ్మింటన్‌ అకాడమీ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

2 /6

శాస్త్రోక్తంగా..: విశాఖపట్టణంలో తన తల్లిదండ్రులతో కలిసి పీవీ సింధు తన అకాడమీ నిర్మాణ పనులను శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది.

3 /6

అకాడమీ: సింధు సెంటర్‌ ఫర్‌ బ్యాడ్మింటన్‌ అండ్‌ ఎక్సలెన్స్‌గా తన అకాడమీకి పీవీ సింధు నామకరణం చేశారని సమాచారం.

4 /6

భారత స్వర్ణం: భారత స్టార్‌ షట్లర్‌గా పీవీ సింధు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక పతకాలు కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో రెండు సార్లు పతకం కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

5 /6

కేసీఆర్, జగన్: అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖపట్టణంలో కేటాయించిన మూడు ఎకరాల్లో సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. కాగా తెలంగాణలో కూడా పీవీ సింధుకు నాటి సీఎం కేసీఆర్‌ భూమి, ఉద్యోగ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

6 /6

భావి షట్లర్లు: తన మాదిరి భావి షట్లర్లను తీర్చిదిద్దేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు పీవీ సింధుకు నజరానాలు ప్రకటించాయి. రెండు రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ప్రభుత్వ స్థలం, నగదు బహుమతులు ప్రకటించాయి.